Search
Saturday 17 November 2018
  • :
  • :

పాక్ నుంచే వచ్చారు

Rajnath-singh_manatelangana copyన్యూఢిల్లీ: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఉగ్రవా దుల దాడి ఘటనపై హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారంనాడు రాజ్యసభలో ప్రకటన చేశారు. ఉగ్రవాదులు రావి నది దాటి పాకిస్తాన్ నుంచి వచ్చారని స్పష్టం చేశారు. ఉగ్రవాద దాడు లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్య లకు వెనుకాడేది లేదన్నారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాలు, గందరగోళం నడుమ రాజ్‌నాథ్ మాట్లాడారు. మన సమగ్రతను, పౌరుల భద్రతను సవాల్ చేసే విధంగా శత్రువులు చేస్తున్న ప్రయత్నా లను భద్రతా బలగాలు సమర్థంగా తిప్పికొట్టేం దుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశ భద్రతను తక్కువ అంచనా వేస్తే దీటుగా తిప్పికొడతామని స్పష్టం చేశారు.  పాక్ నుంచే ఉగ్రవాదులు  భారత భూభాగంలోకి ప్రవేశించినట్టు జిపిఎస్ ప్రాథమిక సమాచారం కూడా విశ్లేషిస్తోందన్నారు. గురుదాస్ పూర్ జిల్లాలోని తాశ్ ప్రాంతంలో రావి నది ప్రవే శిస్తుందని, ఉగ్రవాదులు అక్కడి నుంచే ప్రవేశించా రని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. దీనానగర్-తల్వండి మధ్య రైల్వే ట్రాక్‌లపై బాంబులు అమర్చింది కూడా వారేనని అన్నారు. ఈ నెల 27న సైనిక దుస్తుల్లో ముగ్గురు ముష్కరులు ఉదయం ఐదు న్నర గంటలకు గురుదాస్‌పూర్ పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు ప్రారం భించారని చెప్పారు. పోలీసులు వెంటనే తేరుకుని ఎదురుకాల్పులు ప్రారంభించారని, అప్పటి నుంచి మొదలైన ఆపరేషన్ సుమారు 12గంటల పాటు ఉగ్రవాదులను ఏరివేసేంత వరకు సాగిందని వివ రించారు. అనంతరం ఉగ్రవాదుల నుంచి కొన్ని ఆయుధాలతో పాటు ఒక జిపిఎస్ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నట్టు హోంమంత్రి చెప్పారు.  సరిహద్దుల్లో భద్రత బలగాలు అప్రమత్తంగానే ఉన్నాయని, అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నదులు, కాలువలు ఉప్పొం గడం ఉగ్రవాదులకు కలిసి వచ్చిందని పేర్కొ న్నారు. నెల వ్యవధిలో కాశ్మీర్‌లో ఐదు భారీ చొర బాటు యత్నాలను భద్రతా బలగాలు భగ్నం చేశా యని గుర్తుచేశారు. ఉగ్రవాదులను ఎదుర్కోవ డంలో పంజాబ్ పోలీసులు, భద్రత బలగాలు ధైర్య సాహసాలను ప్రదర్శించాయని, సమర్థవంతంగా ముగ్గురు ముష్కర మూకలను మట్టుబెట్టాయని రాజ్‌నాథ్ ప్రశంసించారు. పంజాబ్ పోలీసుల ఆపరేషన్‌కు సైన్యం, ఎన్‌ఎస్‌జి సరియైన సమయంలో మద్దతుగా నిలిచా యని అన్నారు. దురదృష్టవశాత్తు ఈ పోరాటంలో ఎస్‌పి బల్జీత్ సింగ్‌ను కోల్పోవాల్సి వచ్చిందని, ఉగ్రవాదులను ఏరివేయడంలో ఆయన ముందువ రుసలో నిలిచారని ప్రశంసించారు. ఎగువసభలో రాజ్‌నాథ్ ప్రకటన చేస్తుం డగానే కాంగ్రెస్ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎన్‌డిఎ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. 56అంగుళాల చాతీ ఏ మైందని ప్రశ్నిస్తూ రాజ్యసభలో రగడ సృష్టించారు. ఈ సమయంలో డిప్యూ టీ చైర్మన్ పిజె కురియన్ సభ్యులను వారించినా ఫలితం లేకపోయింది.
లోక్‌సభ నేటికి వాయిదా
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియల నేప థ్యంలో ఆయనతో పాటు మరణించిన ముగ్గురు మాజీ సభ్యులు పాణిగ్రా హి, ఆర్‌ఎస్ గవాయి, బికె హండిక్‌లకు లోక్‌సభ గురువారంనాడు సంతా పం ప్రకటించింది. పంజాబ్‌లోని గురుదాస్ పూర్‌లో ఇటీవల ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల పేర్లను కూడా ఈ సందర్భంగా స్పీకర్ మీరా కుమార్ ప్రస్తావించారు. గురుదాస్‌పూర్‌లో ఉగ్రదాడిని లోక్‌సభ తీవ్రంగా ఖండించింది. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది.

Comments

comments