Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

పాన్‌షాపులపై పోలీసుల దాడులు

Police raids on panchas

మన తెలంగాణ/ఆదిలాబాద్ రూరల్ : గుట్కా, విక్రయిస్తున్న పాన్ షాపులపై రెండవ పట్టణ సిఐ టి.స్వామి ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం స్థానిక రెండవ పట్టణ పరిధి లోని భాగ్యనగర్ కాలనీలో పక్కా సమాచారం మేరకు ఎస్‌ఐ విష్ణు ప్రకాష్ తో కలిసి అకస్మీకంగా దాడులు చేయగా మూడు పాన్‌షాపుల యజమానులు నిషేదిత గుట్కా విక్రయిస్తున్నట్లు నిర్ధారించుకోని సోదాలు చేయగా వారి వద్ద సుమారు వెయ్యి రూపాయల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని నిందితులైన గూగల్‌వార్ వినోద్, గట్లవార్ స్వామి, ఉస్కమల్లా అరవింద్‌లను అరెస్టు చేసి రెండవ పట్టణంకు తరిలించి అనంతరం న్యాయస్థానంలో ప్రవేశ పెడుతున్నట్లు సిఐ వెల్లడించారు.

గుట్కా విక్రేతలు, మట్కా నిర్వహాకులపై బైండ్ ఒవర్ అస్త్రం
గుట్కా, మట్కాలకు అలవాటు పడిన నింధుతులపై రెండవ పట్టణ సిఐ టి.స్వామి మరోసారి బైండ్‌ఒవర్ అస్త్రం ప్రయోగించి కట్టడి చేస్తున్నారు. తాజాగా రెండవ పట్టణ పరిధిలోని గుట్కా విక్రేయలకు అలవాటు పడిన 10 మంది పాత నిందితులైన సయ్యద్ జహేద్, అబ్దుల్ రహీం, చాంద చంద్రయ్య, భీం ప్రశాంత్, ఎండి ముజియుద్దిన్, యంఏ హఖ్, సయ్యద్ ముజ్జర్, ఎస్‌కే ఫయూమ్, యండి ఎక్బాల్, చౌదరీ గజానన్ వీరితో పాటు మట్కా నిర్విహాణలో పేరుకు సుల్తాన్‌లను స్థానిక తహసీల్ధార్ ఈస్టర్ వర్ణ ఎదుట ప్రవేశపెట్టి లక్ష రూపాయల పూచి కత్తుపై ఆరునెలలకు బైండ్‌ఓవర్ చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్‌పి విష్ణు ఎస్.వారియర్ కఠినమైన ఆదేశాల మేర కు గుట్కా, మట్కాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. నిషేదిత గుట్కా వ్యాపారం కోనసాగించికుండ అడ్డుకుంటున్నట్లు తెలిపారు. పట్టణంలో అత్యధికంగా పాన్‌షాపుల ద్వారా ప్రజలకు గుట్కా అందు బాటులో ఉంటుందని నిర్ధారించి దాడులు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో గుట్కా, మట్కా లేకుండ చేయడానికి సంకల్పించిన జిల్లా ఎస్‌పి ఆదేశాలమేరకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 250 మంది అలవాటుపడిన గుట్కా, మట్కా నిందుతులకు బైండ్‌ఒవర్ చేసినట్లు సూచన ప్రాయంగా వెల్లడించారు. దాడుల్లో సిబ్బంది ఠాకుర్ జగన్‌సింగ్, స్వామి పాల్గొన్నారు.

Comments

comments