Home నవ విజ్ఞానం పుట్టబోయే బిడ్డలపై గంజాయి దమ్ము ప్రభావం

పుట్టబోయే బిడ్డలపై గంజాయి దమ్ము ప్రభావం

Men are addicted to marijuana

 

న్యూయార్క్: తండ్రి కానున్న వ్యక్తులు గంజాయికి బానిసలైతే వారి వీర్యంపై దుష్ప్రభావం చూపడమే కాక, వారికి కలుగనున్న సంతానంపై కూడా విపరీత ప్రభావం ఉంటుందని అధ్యయనంలో బయటపడింది. ఈ ప్రభావానికి కారణం గంజాయిలో ఉండే టెట్రాహైడ్రోకెనబినాల్ (టిహెచ్‌సి) అనే పదార్ధం అని తేలింది. ఇది పొగాకు పొగ, క్రిమిసంహారక మందులు, మంటల కాలుష్యాలతో సమాన ప్రభావం కలిగినది. స్థూలకాయం కూడా వీర్య గుణాన్ని మార్చి వేస్తుంది. డ్యూక్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. టిహెచ్‌సి ఎపిజెనెటిక్స్ పై ప్రభావం చూపిస్తుంది. గంజాయి దమ్ము కొట్టే మత్తుబాబుల వీర్యం లోని డిఎన్‌ఎ వ్యవస్థాపక, క్రమబద్ధీకరణ మార్పులకు దారి తీస్తుంది. పురుషుల్లో సంతాన ఉత్పత్తి సామర్ధం పూర్తిగా నశిస్తుందని డ్యూక్ యూనివర్శిటీ ప్రొఫెసర్ స్కాట్ కాలిన్స్ వివరించారు.

ఎలుకలు, మనుషుల్లో వివిధ రకాల వందలాది జన్యువులుపై టిహెచ్‌సి ప్రభావం చూపిస్తుంది. కానీ ఈ జన్యువుల్లో చాలా జన్యువులు చాలా సాధారణంగా ఉంటాయి. కణానికి సంబంధించి రెండు మార్గాలను అవలంబిస్తుంటాయి. ఈ మార్గాల్లో ఒకటి శరీర అవయవాలు పూర్తి స్థాయిలో ఎదగడానికి తోడ్పడుతుంటాయి. రెండవ మార్గంలో జన్యువులు ఎదిగే సమయంలో జన్యువులను నియంత్రిస్తుంటాయి. రెండు మార్గాలు కొన్ని క్యాన్సర్ వ్యాధుల్లో అపసవ్యంగా ఉంటాయి. అభివృద్ధి చెందిన విషయంలో వీటి ప్రభావం ఏమేరకు ఉంటుందో తెలీదు. టిహెచ్‌సి ప్రభావితమైన వీర్యం ఆరోగ్యకరంగా అండకణాన్ని ఫలధీకరించడానికి ఉపయోగపడుతుందో లేదో అలాగే పిండంగా తయారుకాడానికి సహకరిస్తుందో లేదో తెలియదని అసోసియేట్ ప్రొఫెసర్ సుసాన్ కె. మర్ఫీ చెప్పారు. రెగ్యులర్‌గా గంజాయి దమ్ము కొట్టేవారిని, కనీసం వారానికి ఒకసారైనా గంజాయి దమ్ము కొట్టేవారిని, అసలు ఆరు నెలలుగా దమ్మ కొట్టని తమ జీవితంలో పదిసార్లు కన్నా ఎక్కువ సార్లు దమ్ము కొట్టని వారి వీర్యంతో పోల్చి అధ్యయనం చేయగా, పురుషుల మూత్రంలో టిహెచ్‌సి సాంద్రత ఎక్కువగా కనిపించింది. దీనివల్ల వారి వీర్యంలో మార్పులు రావడాన్ని పరిశోధకులు గమనించారు.

                                                                                                                – సైన్స్ విభాగం