Home తాజా వార్తలు పుస్తకాలతో.. కుస్తీ!

పుస్తకాలతో.. కుస్తీ!

Telangana SSC Exams Time Table

 

ఉత్తమ ఫలితాల కోసం తల్లిదండ్రుల ఆరాటం
పరీక్షల వేళ ఒత్తిడి వద్దంటున్న నిపుణులు
పెరుగుతున్న పోటీ తత్వంతో నలిగి పోతున్న విద్యార్థులు
మొదలైన పదో తరగతి ప్రిఫైనల్స్ పరీక్షలు
27 నుంచి ఇంటర్మీడియెట్..
మార్చి 16 నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు 

పరీక్షల సీజన్ మొదలైంది. ఈ రెండు నెలలూ మరో ధ్యాస లేకుండా విద్యార్థులు పుస్తకాలతోనే కుస్తీ పట్టాల్సిన పరిస్థితి. పదోతరగతి పరీక్షలు మార్చి 16న ప్రారంభమవుతుండగా ప్రిఫైనల్ పరీక్షలు మొదలయ్యాయి. ఈ నెల 27 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇదే క్రమంలో డిగ్రీ పరీక్షలు, దీనికి తోడు పోటీ పరీక్షలు దగ్గర పడుతున్న కొద్ది ఆయా విద్యార్థుల్లో ఆందోళన పెరిగిపోతోంది. దీంతో పరీక్షలను ఎదుర్కోవడానికి తల్లిదండ్రులు కూడా సన్నద్ధమయ్యారు. పిల్లలకు అత్యధిక సమయాన్ని కేటాయిస్తూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు చదివిస్తున్నారు.. పిల్లల్లో ఒత్తిడి తగ్గించడానికి భరోసా కల్పిస్తున్నారు.

మన తెలంగాణ/సిటీబ్యూరో: పరీక్షల కాలం దగ్గపడుతుండడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా సన్నద్ధం అవుతున్నారు. తమ పిల్లలకు భరోసా కల్పిస్తూ దగ్గరుండి చదివిస్తున్నారు. పరీక్షల సమయంలో చదివింది సరిగ్గా గుర్తుండదు. పుస్తకం తెరిస్తే టెన్షన్ మొదలవుతుంది. పరీక్షల సమయంలో ఈ ఒత్తిడి సహజం. పదో తరగతి పరీక్షలు మార్చి 16న ప్రారంభమవుతుండగా ఫ్రీఫైనల్స్ పరీక్షలు మొదలయ్యాయి. ఈ నెల 27 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అదే సమయంలో డిగ్రీ పరీక్షలు, దీనికి తోడు పోటీ పరీక్షలు దగ్గర పడుతున్న కొద్ది ఆయా విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో పరీక్షలను ఎదుర్కోవడానికి తల్లిదండ్రులు కూడా సన్నద్ధమయ్యారు. సమాజంలో పిల్లలకు వచ్చే ర్యాంకులు, మార్కులే కొలమానంగా చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా తపన పడుతున్నారు. ఈ రెండు నెలలు పరీక్షల సమయం కావడంతో పిల్లలకు అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నారు. పిల్లలను ఉదయమే నిద్రలేపడం, చదువులపై శ్రద్ద పెంచి చదివించడం చేస్తున్నారు.

దీంతో పాటు పిల్లలకు కావాల్సిన మోడల్ ప్రశ్నాపత్రాలను, మెటీరియల్‌ను తీసుకువచ్చి ప్రాక్టీస్ చేయిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు ఉద్యోగాలకు సెలవులు కూడా పెడుతున్నారు. వ్యాపారస్తులు వ్యాపారానికి సమయం తగ్గించి పిల్లలకు వెచ్చిస్తున్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచి డిప్రేషన్‌కు గురికాకుండా చూసుకుంటున్నారు. చదువుల్లో పెరుగుతున్న పోటీతత్వంతో సరదాలు, సంతోషాలు కూడా దూరం పెట్టి చదువులో నేను మాత్రమే ముందుండాలనే భావనతో విద్యార్థులు కూడా కష్టపడుతున్నారు. తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా పిల్లలు కూఆ పరీక్షలకు సిద్దమవుతున్నారు. విద్యార్థులు ప్రణాళికబద్దంగా ఆత్మ పరిశీలనతో చదివించాలి. విద్యార్థుల్లో ఒత్తిడి పెంచకుండా చదివించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Telangana SSC Exams Time Table Released