Home నిర్మల్ పెద్దల పేరుతో గద్దలు

పెద్దల పేరుతో గద్దలు

ఐసిడియస్‌లో తిమింగిలాలు
సిడిపివో సస్పెన్షన్‌తో భారీగా వెలుగులోకి, కొనసాగుతున్న పర్సంటేజీల జాతర

                ICDS

భైంసా: గర్బిణీలు, బాలింతలు, శిశువులకు అందాల్సిన పౌష్టికాహారాన్ని కొందరు పెద్దలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రుల పేర్లు చెబుతూ గద్దల్లా తన్నుకపోతుండడం చర్చనీయాంశంగా మారు తుంది. ఐసిడిఎస్‌లో గత కొన్ని రోజులుగా కోడిగుడ్లు, పాలు, ఇతర పౌష్టికాహారాన్ని సరఫరా చేసేవారే తిమింగిలాలుగా మారి సంబంధిత అధికారులకు పర్సంటేజిల ఎరవేస్తూ 70 శాతంకు పైగా పక్కదోవ పట్టిస్తున్నారు. కంచే చేను మేసిన విధంగా ముథోల్ సిడిపివో సుగుణా వ్యవహరించడంతో ఆమెపై రాష్ట్ర స్థాయి అధికారుల బృంధం ఇచ్చిన నివేధిక మేరకు ఇటీవల సస్పెన్షన్ వేటు పడింది. అయితే మండల స్థాయిల సక్రమంగా పౌష్టికాహారం అందుతుంది లేంది, విధిగా సంబంధిత శాఖ సూపర్‌వైజర్‌లు సైతం పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే పర్యవేక్షణను ఒకరకంగా గాలికి వది లేయడంతో ఈ పరిస్థితి దాపురించిందంటున్నారు.

జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ సైతం లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందంటున్నారు. పెద్ద ఎత్తున కోడిగుడ్లు, పాల సరఫరాలో గోల్‌మాల్ జరుగుతుంది బహిరంగ రహస్యమేనంటున్నారు. అయితే ఏకంగా జిల్లా మంత్రుల సమీప బంధువులమని సరఫరా చేసేవారు చెప్తుండడమే కాకుండా ఒక్కోసారి దబాయిస్తున్నట్లు సైతం ఆరోపణలున్నాయి. తాము చెప్పినట్లు వినాలని చెప్తూ పర్సెంటేజిలు ఎరవేస్తుండడంతో అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరించడం తప్ప చేసేది ఏమీలేకుండా పోతుందంటున్నారు. పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరుగుతుండ డంతో ఐసిడిఎస్‌లో పౌష్టికాహారం సరఫరా ప్రహాసంగా మారిందంటున్నారు. సిడిపివో సుగుణ వ్యవహారం ముదిరి పాకాన పడడం ఈ విషయం గుప్పుమనడంతో అప్పట్లో మన తెలంగాణ పలు కథనాలు వెలువరించింది. రాష్ట్ర స్థాయి బృంధం తనిఖీలలో అక్రమాలు బయటపడ్డాయి. అయితే ఆమెపై సస్పెన్షన్ వేటు పడకుండా తప్పించేందుకు సంబంధిత శాఖ జిల్లా స్థాయి అధికారులు తమ వంతు సహాయ సహాకారాలు అందించినట్లు ఆరోపణలున్నాయి.

దీంతో వేటు పడడంలో సైతం జాప్యం జరిగినట్లు ఆరోపణలున్నాయి. తనిఖీ బృంధం వచ్చిన రోజు ముథోల్‌లో పలువురు అక్రమాలపై సంబంధిత అధికారులకు విన్నవించి చర్యలు తీసుకోవాలని సైతం కోరారు. అయితే చర్యలపై దాదాపు 3 నెలలు జాప్యం జరిగింది. రాష్ట్ర స్థాయి అధికారులు పకడ్బందీగా వ్యవహరించడంతోనే పెద్ద ఎత్తున పైరవీలు చేసిన సిడిపివోపై వేటు తప్పలేదంటున్నారు. ఈ విషయం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబంధిత శాఖలో చర్చనీయాంశంగా మారింది. ముథోల్‌లో గతంలో కుక్కర్ల కుంభకోణం జరుగగా అప్పట్లో కార్యాలయ యూడిసి మహేష్‌పై వేటు పడింది. ఈ విషయంలో అప్పట్లో సంబంధిత అధికారిని ఉన్నతాధికారులు కాపాడినట్లు విమర్శలున్నాయి. ఇంత జరుగుతున్న ఎవరు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తుంది. కుక్కర్ల కుంభకోణం జరిగిన కొన్ని నెలల్లోనే బియ్యం కందిపప్పు ఇతర సరకుల కుంభకోణం ముథోల్‌లో జరిగింది. ఏకంగా సిడిపివో పైనే వేటు పడడం కలకలం రేపుతుంది. మండల పరిషత్ స్థాయిలో పర్యవేక్షించే సూపర్‌వైజర్లు సైతం తమకు సైతం ఉచ్చు బిగుస్తోందన్న ఆందోళన వెంటాడుతుంది. కోడిగుడ్లు, పాల సరఫరాలో ఒక్కోసారి నెల కోటనే మాయమవుతున్నట్లు ఆరోపణలున్నాయి.

బీజీగా ఉన్నాను: పిడి విజయ లక్ష్మీ

ముథోల్ వ్యవహారాలపై ఐసిడియస్ జిల్లా పిడి విజయలక్ష్మీ శుక్రవారం సాయంత్రం చరవాణిలో సంప్రదించింది. అయితే తాను బిజీగా ఉన్నట్లు ఆమె చెప్పింది. కోడి గుడ్లు, పాల సరఫరా తీరు సిడిపిఒ సుగుణ సస్పెన్షన్‌పై సరైన రీతిలో స్పందించలేదు. భైంసా: గర్బిణీలు, బాలింతలు, శిశువులకు అందాల్సిన పౌష్టికాహారాన్ని కొందరు పెద్దలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రుల పేర్లు చెబుతూ గద్దల్లా తన్నుకపోతుండడం చర్చనీయాంశంగా మారు తుంది. ఐసిడిఎస్‌లో గత కొన్ని రోజులుగా కోడిగుడ్లు, పాలు, ఇతర పౌష్టికాహారాన్ని సరఫరా చేసేవారే తిమింగిలాలుగా మారి సంబంధిత అధికారులకు పర్సంటేజిల ఎరవేస్తూ 70 శాతంకు పైగా పక్కదోవ పట్టిస్తున్నారు. కంచే చేను మేసిన విధంగా ముథోల్ సిడిపివో సుగుణా వ్యవహరించడంతో ఆమెపై రాష్ట్ర స్థాయి అధికారుల బృంధం ఇచ్చిన నివేధిక మేరకు ఇటీవల సస్పెన్షన్ వేటు పడింది. అయితే మండల స్థాయిల సక్రమంగా పౌష్టికాహారం అందుతుంది లేంది, విధిగా సంబంధిత శాఖ సూపర్‌వైజర్‌లు సైతం పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే పర్యవేక్షణను ఒకరకంగా గాలికి వది లేయడంతో ఈ పరిస్థితి దాపురించిందంటున్నారు.

జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ సైతం లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందంటున్నారు. పెద్ద ఎత్తున కోడిగుడ్లు, పాల సరఫరాలో గోల్‌మాల్ జరుగుతుంది బహిరంగ రహస్యమేనంటున్నారు. అయితే ఏకంగా జిల్లా మంత్రుల సమీప బంధువులమని సరఫరా చేసేవారు చెప్తుండడమే కాకుండా ఒక్కోసారి దబాయిస్తున్నట్లు సైతం ఆరోపణలున్నాయి. తాము చెప్పినట్లు వినాలని చెప్తూ పర్సెంటేజిలు ఎరవేస్తుండడంతో అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరించడం తప్ప చేసేది ఏమీలేకుండా పోతుందంటున్నారు. పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరుగుతుండ డంతో ఐసిడిఎస్‌లో పౌష్టికాహారం సరఫరా ప్రహాసంగా మారిందంటున్నారు. సిడిపివో సుగుణ వ్యవహారం ముదిరి పాకాన పడడం ఈ విషయం గుప్పుమనడంతో అప్పట్లో మన తెలంగాణ పలు కథనాలు వెలువరించింది. రాష్ట్ర స్థాయి బృంధం తనిఖీలలో అక్రమాలు బయటపడ్డాయి. అయితే ఆమెపై సస్పెన్షన్ వేటు పడకుండా తప్పించేందుకు సంబంధిత శాఖ జిల్లా స్థాయి అధికారులు తమ వంతు సహాయ సహాకారాలు అందించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వేటు పడడంలో సైతం జాప్యం జరిగినట్లు ఆరోపణలున్నాయి.

తనిఖీ బృంధం వచ్చిన రోజు ముథోల్‌లో పలువురు అక్రమాలపై సంబంధిత అధికారులకు విన్నవించి చర్యలు తీసుకోవాలని సైతం కోరారు. అయితే చర్యలపై దాదాపు 3 నెలలు జాప్యం జరిగింది. రాష్ట్ర స్థాయి అధికారులు పకడ్బందీగా వ్యవహరించడంతోనే పెద్ద ఎత్తున పైరవీలు చేసిన సిడిపివోపై వేటు తప్పలేదంటున్నారు. ఈ విషయం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబంధిత శాఖలో చర్చనీయాంశంగా మారింది. ముథోల్‌లో గతంలో కుక్కర్ల కుంభకోణం జరుగగా అప్పట్లో కార్యాలయ యూడిసి మహేష్‌పై వేటు పడింది. ఈ విషయంలో అప్పట్లో సంబంధిత అధికారిని ఉన్నతాధికారులు కాపాడినట్లు విమర్శలున్నాయి. ఇంత జరుగుతున్న ఎవరు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తుంది. కుక్కర్ల కుంభకోణం జరిగిన కొన్ని నెలల్లోనే బియ్యం కందిపప్పు ఇతర సరకుల కుంభకోణం ముథోల్‌లో జరిగింది. ఏకంగా సిడిపివో పైనే వేటు పడడం కలకలం రేపుతుంది. మండల పరిషత్ స్థాయిలో పర్యవేక్షించే సూపర్‌వైజర్లు సైతం తమకు సైతం ఉచ్చు బిగుస్తోందన్న ఆందోళన వెంటాడుతుంది. కోడిగుడ్లు, పాల సరఫరాలో ఒక్కోసారి నెల కోటనే మాయమవుతున్నట్లు ఆరోపణలున్నాయి.

బీజీగా ఉన్నాను: పిడి విజయ లక్ష్మీ

ముథోల్ వ్యవహారాలపై ఐసిడియస్ జిల్లా పిడి విజయలక్ష్మీ శుక్రవారం సాయంత్రం చరవాణిలో సంప్రదించింది. అయితే తాను బిజీగా ఉన్నట్లు ఆమె చెప్పింది. కోడి గుడ్లు, పాల సరఫరా తీరు సిడిపిఒ సుగుణ సస్పెన్షన్‌పై సరైన రీతిలో స్పందించలేదు.