Search
Saturday 21 July 2018
  • :
  • :

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట

Govt is spending crores of rupees for poor peoples health
పెగడపల్లి: పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. మండలంలోని అయితుపల్లి గ్రామానికి చెందిన జేరిపోతుల కాంతవ్వ ఆనారోగ్యం బారిన పడగా ఆమెకు ముందస్తు వైద్య ఖర్చుల కోసం రూ. లక్ష విలువ చేసే ఎల్‌ఒసి పత్రాన్ని శనివారం చీఫ్‌విప్ బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్‌కు బాధిత కుటుంబ సభ్యులు, గ్రామ, మండల టిఆర్‌ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మండలంలోని నంచర్ల గ్రామంలోని ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వ నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న నంచర్ల గ్రామ చెరువు వరకు విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు, రైతులు ఈశ్వర్‌కు వినతి పత్రం అందించారు. అలాగే మండలంలోని బతికెపల్లి గ్రామానికి చెందిన మండ నర్సయ్య ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై మరణించగా ఆయన కుటుంబానికి విద్యుత్ శాఖ నుంచి మంజూరైన రూ.4 లక్షల నష్టపరిహారం చెక్కును చీఫ్‌విప్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఓరుగంటి రమణారావు, పలుమారు మల్లేశ్‌యాదవ్, మంత్రి వేణు, హరిగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments