Home ఆదిలాబాద్ ప్రతి తప్పుకూ ఓ శిక్ష తప్పదు…

ప్రతి తప్పుకూ ఓ శిక్ష తప్పదు…

ఆదిలాబాద్: సహజంగా మనుషులు తప్పులు చేస్తుంటారు కొన్ని తెలిసి మరికొన్ని తెలియక తప్పులు జరుగుతుంటాయి. కొందరైతే తప్పుచేసి ఏమవుతుందిలే అని తేలికగా ప్రవర్తిస్తారు. ఇలాంటి వారి వల్ల తనతో పాటు ఎదుటి వారికి నష్టమే. కొందరు బహిరంగంగా పోగ తాగడం మామూలే కదా అని ఎక్కడ పడితే అక్కడ పీల్చేస్తుంటారు. మరికొందరు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ పరధ్యానంగా వాహనాలు నడుపుతుంటారు. ఇలా చేయడంతో ప్రమాదాలు జరుగుతాయని తెలిసి కూడా ఆర్టీసీ డ్రైవర్లు కూడా బస్సులు నడుపుతున్నారు. కలీ ్తకల్లు తయారు చేసి ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్నారు. యధేచ్చంగా పచ్చని చెట్లను నరికివేస్తున్నారు. చెట్లను అక్రమంగా నరకడం చట్ట విరుద్దమని ప్రతి వ్యక్తికి తెలిసినా దానిని అరికట్టలేకపోతున్నారు.“మన తెలంగాణ” ప్రత్యేక కథనం

06adbot01p2మద్యంసేవించి వాహనాలు నడిపితే…
పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో శ్వాసను పరీక్షించే సమయంలో అల్కాహాల్ శాతం మోతాదులో ఉన్నట్లు తేలితే 6 నెలల జైలు శిక్షతో పాటు రూ,3 వేల వరకు జరిమాన విధించవచ్చు.
06adbot01p4ప్రమాదకరంగా వాహనాలు నడిపితే…
పబ్లిక్ ప్లేసుల్లో ప్రమాదం కలిగించే విధంగా వాహనాలు నడిపితే 6 నెలల జైలు శిక్ష లేదా, వెయ్యి రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు.అటవీ సంపదకు నష్టం కలిగిస్తే…
అటవీ ప్రాంతంలో నెమళ్లు, కుందేళ్లు, జింకలు, నీలుగాయి, సాంబారు లాంటి తదితర జంతువులు వెటగాళ్ల భారిన పడుతున్నాయి. ఇలాంటివి చేసి అటవీ సంపదకు నష్టం కలిగిస్తే 2 నెలల నుంచి ఏడాది పాటు జైలు శిక్షతో పాటు రూపాయలు 10 వేల జరిమాన విధిస్తారు.
06adbot01p1పొగతాగడమూ నేరమే…
బహిరంగ ప్రదేశాల్లో పోగతాగడం నేరమని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హోటళ్లు, ఇతర చోట్ల నోటీసు బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. నా డబ్బులు నాఇష్టం అంటే కుదరదు. నా ఇష్టం వచ్చిన రీతిన పోగతాగుతానని పోగరాయుళ్లు అనుకుంటే కుదరదు. జన సంచార ప్రదేశాల్లో , బస్టాండ్‌లలో, పాఠశాలల వద్ద ఇతరులకు ఇబ్బంది కలిగించే చోట ధూమపానం చేస్తే జరిమాన విధించి జైలుకు పంపించే అవకాశాలుంటాయి.
06adbot01p5చెల్లని చెక్కు ఇచ్చిన శిక్ష…
కొందరు వ్యక్తులు తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకున్నా దర్జాగా తప్పించుకునేందుకు అతి తెలివి ప్రదర్శించి చెల్లని చెక్కులిచ్చి తప్పుకుంటున్నారు.చెక్కు తీసుకున్నవారు బ్యాంకులకు వెళితే అందులో డబ్బులు లేవని సమాధానం వస్తుంది. చెల్లని చెక్కు బౌన్స్ అయితే 138 ఎన్‌ఐ యాక్ట్ కింద సివిల్ కోర్టు కేసు నమోదు చేయమని పోలీసులను అదేశిస్తుంది.
ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపినా నేరమే…
సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. ఇలా పలుమార్లు సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపినట్లు పోలీసు, ఆర్టీఏ ఆధికారులకు చిక్కితే ఓక్కో మారు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయించే అధికారం స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ కు ఉంటుంది. పలువురు ఆర్టీసీ డ్రైవర్లు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణిస్తే వెయ్యి జరిమానా విధిస్తారు. మద్యం తాగి వాహనాలు నడిపినా వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించే అధికారం పోలీసులకు ఉంది. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే రూ.500 జరిమాన విధిస్తారు.
కాలం చెల్లిన వాహనం నడిపినా నేరమే…
కాలం చెల్లిన వాహనాలు , ఆటోలు, బస్సులు, ఇతరాత్ర వాహనాలు నడపడం నేరమే అవుతుంది. కాలం చెల్లిన వాహనాలను అర్టీఏ అధికారులు సీజ్ చేయడంతో పాటు 10 వేల జరిమానా విధిస్తారు.
ప్లాస్టిక్ భూతం ప్రమాదమే…
ప్లాస్టిక్ భూతం చాలా ప్రమాదకరమైంది. ప్రజారోగ్య చట్టంకింద 20 మైక్రాన్ల కన్న తక్కువ ఎక్కువ బరువున్నా పాలిథీన్ సంచులను ప్రభుత్వం నిషేదించింది. ఈ విషయంలో రూ,100 నుంచి రూ,2500ల వారకు జరిమానా విధిస్తారు. వాటిని అమ్మే వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేయవచ్చని చట్టం చెబుతోంది.
06adbot01p6కల్తీ కల్లుతో కటకటాలే…
కల్తీ కల్లు తయారు చేస్తే కటకటాలు తప్పవు. లైసెన్స్ కూడా రద్దవుతుంది. వెంటనే దుకాణం కూడా సీజ్ చేస్తారు. కల్తీ కల్లు విక్రయించి అమాయక ప్రజల ప్రాణాలకు హానీ కలిగిస్తే రూ,2 వేల జరిమాన విధించి కేసులు నమోదు చేస్తారు.