Search
Wednesday 14 November 2018
  • :
  • :

ప్రతి మండలానికి ప్రత్యేకాధికారి

అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకోవాలి
‘గ్రామజ్యోతి’ అమలుపై చర్చించిన కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్
collector-Neetu-Prasadకలెక్టరేట్‌ః జిల్లాలో ‘గ్రామజ్యోతి’ పథకం అమలుకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గ్రామజ్యోతి పథకం అమలుకు ప్రతి అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఆదేశించారు. ఎంపి, ఎంఎల్‌ఎ, ఎంపిటిసిలు, జడ్‌పిటిసిలు తమ పరిధిలోని ఒక గ్రామాన్ని దత్తతకు తీసుకోవాలని సూచించారు. గ్రామ సమగ్రాభివృద్ధికి ఈ పథకం దోహదం చేస్తుందని, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అదనపు జెసి డాక్టర్ నాగేంద్ర, జడ్‌పి సిఇఓ సూరజ్ కుమార్, సిపిఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments