Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ప్రత్యేక ఆరోగ్య జిల్లాగా మెదక్

72 ఆసుపత్రుల ఆధునీకరణ

మొదటి దశలో 32, రెండవ దశలో 40
వీటిలో మెరుగైన సౌకర్యాలు
వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఎఎన్‌ఎంలకు ప్రత్యేక శిక్షణ తరగతులు
వెల్దుర్తి ఆసుపత్రిలో నెలకొన్న అపరిశుభ్రతపై ఆగ్రహం
జిల్లా వైద్యాధికారి బాలాజీపవార్

1mdvelp1వెల్దుర్తి : ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అం దించడం ముఖ్యమంత్రి కెసిఆర్ స్వప్నం అని జిల్లా ప్రభుత్వ వైద్యాధికా రి బాలాజీపవార్, జిల్లా అదనపు వైద్యాధికారి కాళిదాసచారిలు అన్నా రు. ఇందుకోసం కెసిఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పి స్తున్నారన్నారు. అందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ ఆసుప త్రులను ఆధునీకరిస్తున్నామన్నారు. ఈ మేరకు జిల్లాలోనే మొట్టమొదటి సారిగా వెల్దుర్తి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి రంగులు వేయడానికి కావలసిన పెయిటింగ్ డబ్బాలను వారు స్వయంగా శనివారం తీసుకు వచ్చారు.

ఈ క్రమంలో ఆసుపత్రి ఆవరణలో నెలకొన్న అపరిశుభ్రత, సిబ్బంది, రోగులు ఉండే గదుల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం పట్ల సిబ్బంది పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ వైపు ప్రధాన మంత్రి మోడీ, మరోవైపు ముఖ్య మంత్రి కెసిఆర్‌లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని యుద్ధప్రాతి పాదికన చేపడుతున్నా ఇక్కడి సిబ్బందిలో చైత న్యం రాకపోవడం పట్ల అసహనం వ్యక్తంచేశారు. సిబ్బందిలో మార్పుతే వడం కోసం స్వచ్ఛ భారత్ పేరిట స్వయంగా ఆసుపత్రిలో పేరుకపోయిన చెత్తాచెదారాన్ని వారు తొలగించారు. ఇకనైనా సిబ్బంది తన పనితీరు మా ర్చుకోవాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
1mdvelp1(1)అనంతరం జిల్లావైద్యాధికారి బాలాజీపవార్ విలేఖరులతో మాట్లాడు తూ మెదక్ జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఆరోగ్య జిల్లాగా తీర్చిది ద్దేం దుకు జిల్లాలోని 72 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మొదటి దశలో 32, రెండవ దశలో మిగతా 40 ఆసుపత్రులను ఆధునీ కరించి వాటిలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సమైక్యరా ష్ట్రంలో సిబ్బంది తన వృత్తిని మరచిపోయి నామ్‌కేవాస్తేగా విధులు నిర్వర్తించారని వాపోయారు. వైద్యులు సిబ్బందికి తిరిగి తన వృత్తి ధర్మాన్ని గుర్తుచేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు గాను ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.

మొదటి దశలో జిల్లాలోని 120 మంది వైద్యులకు ప్రతి గురువారం , రెండవ దశలో మొత్తం స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు, ఫార్మాసిస్ట్‌లకు జిల్లా కేంద్రంలోని స్కిల్‌డెవలప్‌మెంట్ ల్యాబ్ లో ప్రత్యేకంగా అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఆసుపత్రుల్లోని మెడిసిన్‌లు వృథాకాకుండా ఉండేందుకు గాను ప్రతి ఆరోగ్య కేంద్రాన్ని ఆన్‌లైన్ వ్యవస్థకు అనుసంధానం చేశామన్నారు. వీరి వెంట ఇమ్యునరైజేషన్ జిల్లా అధికారి సునీల్‌కుమార్ కూడా ఉన్నారు.

Comments

comments