Home తాజా వార్తలు ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది

ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది

Tammineni-Veerabhadramనారాయణపేట: కెసిఆర్ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నంపెట్టే రైతులపై దాడిచేసిన ఏ ప్రభుత్వం నిలబడలేదని, మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై లాఠీచార్జి జరిపించిన కెసిఆర్ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని అన్నారు. నిర్వాసితులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తమ్మినేని తెలిపారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ అనవసరమని ఇంజినీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నా వినకుండా సిఎం కెసిఆర్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు.