Search
Wednesday 14 November 2018
  • :
  • :

ప్రయాణం..నరకం

  • అరకొర బస్సులు…
  • ఫుట్‌బోర్డులపై వెళుతున్న విద్యార్థులు
  • ప్రమాదమని తెలిసినా తప్పనిస్థితి

Medak_Travelling_Problemsనారాయణఖేడ్ : విద్యార్థుల చదువు వారి ప్రాణం మీదకు వస్తోంది. అరకొర బస్సులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిక్కిరిసిన బస్సులలో ప్రయాణించలేక నరకయాతన పడుతున్నారు. పలు సందర్భాల్లో ప్రమాదాల బారిన పడు తున్నారు. అయినా అధికారులు ఈ సమస్యపై దృష్టిసా రించకపోవడంతో నిత్యం విద్యార్థులు ఇబ్బందులు పడు తూనే పాఠశాలలకు వెళుతున్నారు.
తెలంగాణలో నారాయణఖేడ్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం. అక్కడ సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయి. దీంతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లి విద్యనభ్య సించడం వారికి గగణంగానే మారింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో బస్సులు తక్కువగా ఉండడంతో విద్యార్థులు బస్సులపై, ఫుట్‌బోర్డులపై ప్రయాణించవలసి వస్తుంది. పలు సందర్భాల్లో ప్రమాదాలు కూడా చో టు చేసుకుంటు న్నాయి. రెండు బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ఒకే బస్సులో, బస్సుపైన కిక్కిరిసేలా ప్రయాణించడంతో తోపులాటతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
నివారణపై చర్యలేవీ? : ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపాలని ప్రభుత్వం చెబుతుంది. అయితే వారి క్షేమంపై మాత్రం దృష్టిని సారించడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష ఫలితం చిన్నారి విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది. ప్రతినిత్యం ఇతర ప్రదేశాలకు వెళ్లి విద్యనభ్యసించాలంటే ప్రయాణంలో మృత్యువుతో పోరాటం తప్పడం లేదు. పలుమార్లు ప్రమాదాలకు గురై  విద్యార్థుల ప్రాణాలు పోతు న్నాయి. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.  ప్రమాదం జరిగిన పలుమార్లు అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ మరుసటి రోజు మరవడం పరిపాటిగా మారింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులకు ప్రయాణం సులువుగా  ఉం డేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు బస్సులు పడపాలని తల్లిదం డ్రులు కోరినా ఫలితం లేకపోతుం దని వారు వాపోతున్నారు. ప్రతినిత్యం కంగ్టి, మనూరు, కల్హేర్, రేగోడ్  మండలాల నుంచి విద్యన భ్యసించేందుకు నారాయణఖేడ్‌కు విద్యార్థులు ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. బస్సులు కిక్కిరిసి వస్తుండడంతో విద్యార్థులు బస్సు పైన, ఫుట్‌బోర్డులపై నిలబడి ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు బస్సులు నడపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Comments

comments