Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించిన శృతిహాసన్

Shruti Haasanస్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఇటు సౌత్‌లోనూ అటు బాలీవుడ్‌లో గ్లామరస్‌తారగా రాణిస్తోంది. పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కథానాయికగానే కాకుండా సింగర్‌గానూ తన టాలెంట్‌ను చాటిన శృతిహాసన్ తాజాగా ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించడం విశేషం. ‘ఇసిద్రొ’ పేరిట ప్రారంభించిన ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈ హాట్‌భామ వివిధ భాషల్లో షార్ట్ ఫిల్మ్, డిజిటల్ ఫిల్మ్, మ్యూజికల్, మల్టీమీడియా కాంటెంట్స్‌ను నిర్మిస్తుందట. విలక్షణ కథానాయకుడు కమల్‌హాసన్ తనయురాలైన శృతిహాసన్ తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది. ఇక సినిమాల్లో పాటలు కూడా పాడుతున్న ఈభామ చేతిలో ప్రస్తుతం 7 సినిమాలున్నాయి. వీటితో వచ్చే ఏడాది వరకు బిజీబిజీగా ఉండనుంది. ఇసిద్రొ ప్రొడక్షన్ హౌస్ ద్వారా యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తానని శృతిహాసన్ చెబుతోంది. బాలీవుడ్‌లో ప్రస్తుతం వెల్‌కమ్ బ్యాక్, రాకీ హ్యాండ్‌సమ్, యారా సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. దీంతో పాటు అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి మిలన్ లుత్రియా సినిమా ‘బాద్‌షాహొ’ సినిమా చేయనుంది. ‘శ్రీమంతుడు’లో మహేష్‌బాబు సరసన నటించిన ఈ అమ్మడు సూర్య, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించిన శృతిహాసన్‌కు భవిష్యత్తులో సినిమాలు కూడా నిర్మించాలన్న ప్లాన్ కూడా ఉందట.

Comments

comments