Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఫిల్మ్‌మేకర్స్ హాట్ ఫేవరేట్

samanthaతెలుగు, తమిళ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న తార సమంత. వరుసగా సినిమాలతో తీరికలేకుండా ఉన్నప్పటికీ సమంతకు మరిన్ని అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. ఫిల్మ్‌మేకర్స్‌కు ఆమె హాట్ ఫేవరేట్‌గా మారడం విశేషం. ప్రస్తుతం ఈ భామ సూర్య, విజయ్, ధనుష్, విక్రమ్ తదితర స్టార్లతో కలిసి నటిస్తోంది. తాజాగా నితిన్-త్రివిక్రమ్ సినిమాలోనూ సమంత అవకాశం వచ్చిందట. దీంతో పాటు ‘బెంగుళూర్ డేస్’ తెలుగు రీమేక్‌లోనూ నటించనుంది. ఇక యంగ్ డైరెక్టర్స్ గుణ, శంకర్‌లు తమ కొత్త చిత్రం ‘బ్రూస్‌లీ’ కోసం సమంతను సంప్రదించారట. హీరోగా మారిన మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ సినిమాలో కథానాయకుడు. సినిమా కోసం సమంతతో సంప్రదింపులు జరుగుతున్నాయట. సినిమాకు ఈ అమ్మడు ఓకే చెప్పడం ఖాయమంటున్నారు.

Comments

comments