Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఫ్లిప్‌కార్ట్ బాటలో ఫ్యూచర్ గ్రూప్!

 గ్లోబల్ రిటైలర్‌కు స్వల్పంగా వాటాల అమ్మకానికి సన్నాహాలు

 సంకేతాలిచ్చిన సిఇఒ బియానీ

Furture-Groupన్యూఢిల్లీ : దేశీయ రిటైల్ మార్కెట్ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్ కూడా ఫ్లిప్‌కార్ట్ బాటలో పయనించనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అధిక వాటాను వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన తర్వాత ఫ్యూచర్ గ్రూప్ పైనా ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక అంతర్జాతీయ రిటైలర్‌కు సంస్థలో కొంత వాటాను విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ సిఇఒ కిషోర్ బియానీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో బియా మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా పటిష్ఠమైన రిటైలర్‌కు స్వల్ప వాటాను విక్రయంచనున్నామని అన్నారు. అయితే ఆ కంపెనీ పేరు ఏమిటో వెల్లడించలేదు. ఫ్యూచర్ గ్రూప్‌లో 10 శాతం వాటను విక్రయించేందుకు ముందుగా వాల్‌మార్ట్, అమెజాన్‌లతో చర్చలు జరిపినట్టు బియానీ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతో ఇన్వెస్టర్ల దృష్టి ఒక్కసారిగా ఫ్యూచర్ గ్రూప్ కౌంటర్లపైకి మళ్లినట్లు నిపుణులు పేర్కొన్నారు. బిఎస్‌ఇలో ఫ్యూచర్ మార్కెట్ నెట్‌వర్క్ 9 శాతం దూసుకెళ్లి రూ.135కు చేరింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.150 వరకూ ఎగసింది. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ 2 శాతం పెరిగి రూ. 465 వద్ద, ఫ్యూచర్ కన్జూమర్ 4 శాతం ఎగసి రూ. 59 వద్ద, ఫ్యూచర్ రిటైల్ 5 శాతం పెరిగి రూ.601 వద్ద ట్రేడయ్యాయి. ఇక ఫ్యూచర్ సప్లైచైన్ సొల్యూషన్స్ కూడా0.75 శాతం లాభపడి రూ.680 వద్ద స్థిరపడింది.
అయితే ఫ్లిప్‌కార్ట్ వాల్‌మార్ట్ మెగాడీల్ ఓకే కావడం.. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 16 బిలియన్ డాలర్లకు వాల్‌మార్ట్ దక్కించుకోవడం జరిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఇకామర్స్ డీల్ కుదరగా.. వచ్చే దశాబ్దంలో భారత్ ఆన్‌లైన్ మార్కెట్ 200 బిలియన్ డాలర్లకు పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌తో సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ ఆధ్వర్యంలో దేశీయ ఇ కామర్స్ కంపెనీని 20 బిలియన్ డాలర్లుగా వెలకట్టారు. భారత్‌లో ఇదే అతిపెద్ద డీల్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ కూడా వాటాలను విక్రయించేందుకు వేగంగా అడుగులు వేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
డీల్ భారత్‌కు మంచిది: వాల్‌మార్ట్ సిఇఒ
16 బిలియన్ డాలర్ల ఫ్లిప్‌కార్ట్ స్వాధీన ఒప్పందంపై వస్తున్న ఆందోళనలను తగ్గించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ వాల్‌మార్ట్ ప్రయత్నించింది. ఈ డీల్ భారత్ మంచిందని, తక్కువ సమయంలో లక్షలాది ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, దేశీయ ఆర్థిక వృద్ధికి ఇది దో హదం చేస్తుందని వాల్‌మార్ట్ సిఇఒ డౌ మెక్‌మిలన్ అన్నా రు. ప్రధాని నరేంద్ర మోడీ లేదా మంత్రులను మెక్ మిలన్ కలుసుకోకపోవడంపై ఆయన స్పందిస్తూ.. గతంలో ఇక్క డ అధికారులతో భేటీ అయ్యానని, భవిష్యత్‌లో వారితో సమావేశమవుతానని అన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను.. 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రపంచ అతిపెద్ద రిటైలర్ వాల్‌మార్ట్ అధికారికంగా ప్రకటించింది. అంటే మన కరెన్సీలో డీల్ విలువ రూ. 1,07,728 కోట్లుగా ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ డీల్‌ను పూర్తి చేయనున్నారు. ఈ ఏడాదిలో దేశంలో ఇదే అతిపెద్ద డీల్ కావడం విశేషం. 130 కోట్ల జనాభా కల్గిన భారత్‌లో తమ మార్కెట్‌ను పెంచుకునేందుకు ఈ ఒప్పం దం ఎంతగానో దోహదం చేస్తుందని వాల్‌మార్ట్ పేర్కొం ది. అంతర్జాతీయంగా ప్రత్యర్థిగా ఉన్న అమెజాన్‌కు గట్టిపోటీని ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ విధానాలు తమకు సాయపడతాయని అభిప్రాయపడింది. తమ పెట్టుబడులు భారతీయులకు నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందుబాటు ధర ల్లో అందించేందుకు ఉపయోగపడతాయని పేర్కొంది.

Comments

comments