Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.45-50

రైతుబజారులో కిలో రూ.35-40

ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఉల్లిగడ్డ ధరలు
హైదరాబాద్‌కు తగ్గిన దిగుమతులు
మరికొన్ని రోజులు తప్పని ధరల మంట

003మలక్‌పేట్: నగర ప్రజలకు మరికొన్నాళ్లు ఉల్లిఘాటు, ధరల పోటు తప్పేటట్లు కని పించడం లేదు. ఇప్పటికే పెరిగిన ధరలతో వినియోగదారుల కంట తడిపెట్టిస్తున్న ఉల్లిగడ్డ రానున్న రోజుల్లో మరింత ఘాటె క్కడం ఖాయంగా కనిపిస్తోంది. ధరల విష యంలో చుక్కలు చూస్తున్న ప్రజలు రాను న్న రోజుల్లో దిమ్మతిరిగిపోయేలా ఉన్నారు. పరిస్థితులు చూస్తుంటే ఉల్లిపాయ తినడమే మహాభాగ్యం అనే స్థితి వచ్చేలా ఉంది. ప్రస్తుతం రైతుబజారులోనే ఉల్లిపాయలు ధర కిలో 35 నుంచి 40 రూపాయలు వుంది. బహిరంగమార్కెట్‌లో కిలో రూ.50 వరకు విక్రయిస్తున్నారు. ఉల్లిపాయ దిగుమతి అయ్యే ప్రధాన మార్కెట్ అయిన మలక్‌పేట్‌లోని మహబూబ్‌మాన్షన్ శ్రీకృపా మార్కెట్లో రోజురోజుకు ఉల్లి దిగుమతి తగ్గిపోతోంది. ప్రతిరోజు దాదాపు కొన్ని క్వింటాళ్ల చొప్పున దిగుమతి తగ్గిపోతుండడంతో ఉల్లిగడ్డల ధరలకు రెక్కలు వస్తున్నాయి.

నగరానికి ప్రధానంగా మహారాష్ట్ర నుండి వచ్చే ఉల్లిగడ్డలే శరణ్యం. మహారాష్ట్ర తరువాత చెప్పుకోదగ్గది కర్నూలు. అయితే మహారాష్ట్రలో పండే ఉల్లిగడ్డలకు ఉత్తర భారత రాష్ట్రాల్లో విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీనితో మహారాష్ట్రలోని రైతులు, వ్యాపారులు తాము పండించిన ఉల్లిగడ్డను ఉత్తర భారతదేశ రాష్ట్రాలైన గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్ తదతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడికి ఎగుమతి చేస్తే లాభాలు ఎక్కువగా ఆర్జించవచ్చనే దృక్పథంతో వ్యాపారులు, రైతులు తమ పంటను హైదరాబాద్‌కు తరలించేందుకు ఇష్టపడటం లేదు. దీనితో హైదరాబాద్‌కు ఉల్లిగడ్డల దిగుమతి విపరీతంగా తగ్గిపోయింది. ఫలితంగా ఉల్లిపాయల ధరలకు రెక్కలు వచ్చాయి. కొన్నాళ్ల కిందటి వరకు మహారాష్ట్ర నుండి ప్రతిరోజు 100 నుండి 150 లారీల ఉల్లిగడ్డల లోడ్‌లు వచ్చేవి. అయితే అవి ప్రస్తుతం 50 నుండి 60 లోడ్‌లకే పరిమితమవుతున్నాయి. అంటే ప్రతిరోజు సుమారు వంద లారీల లోడ్‌ల ఉల్లిగడ్డలు దిగుమతి కావడం ఆగిపోయాయి. ఒక లారీ లోడ్‌లో దాదాపు 10 టన్నుల ఉల్లిపాయలు ఉండేవి. అంటే సరాసరిగా ప్రతిరోజు 125 లారీల ఉల్లిగడ్డ దిగుమతి అయితే 1250 కింటాళ్లు మార్కెట్‌కు వచ్చేవి. అయితే ఇప్పుడు కేవలం 500 క్వింటాళ్లు మాత్రమే దిగుమతి అవుతుంది. అంటే కేవలం మహారాష్ట్ర నుండి దిగుమతి అయ్యే ఉల్లిగడ్డల్లోనే దాదాపు 700 క్వింటాళ్లు తగ్గిపోయాయి. ఇదిలాఉండగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుండి వచ్చే ఉల్లిగడ్డ కూడా ఎక్కువగానే ఉండేది.

అయితే వర్షాభావం కారణంగా అక్కడ దిగుబడి పూర్తిగా తగ్గిపోవడంతో దాదాపుగా మార్కెట్‌కు ఉల్లిగడ్డ రావడమే లేదు. దీనితో మహారాష్ట్ర నుండి వస్తున్న ఉల్లిగడ్డే ప్రధానంగా మారింది. గతంలో క్వింటాళ్ళు ఉల్లిగడ్డ ధర రూ.700 నుండి రూ.800 పలికితే ఇప్పుడు రూ. 3 వేల నుండి 4 వేల మధ్యన పలుకుతోంది. దీనితో ఉల్లిగడ్డ ధరలు విపరీతంగా పెరిగాయి. అంతేకాకుండా కొత్త ఉల్లిగడ్డ ధర గతంలో రూ.400 నుండి రూ.600 పలికేది. అదే ఇప్పుడు రూ. 2 వేల నుండి రూ.3400 వరకు పలుకుతోంది. అంటే ఉల్లిగడ్డ కొరత ఏ మేరకు ఉందో అర్థమవుతోంది. కర్నూలు, మహారాష్ట్రల నుండి శుక్రవారం మలక్‌పేట్ మార్కెట్లోకి 75 లోడుల ఉల్లిగడ్డ దిగుమతి అయ్యింది. అయితే రెండు రోజులతో పోల్చితే ఈ రోజు కొద్దిగా పరిస్థితి మెరుగైందనే చెప్పవచ్చు. కాకపోతే మార్కెట్లోని డిమాండ్‌ను తట్టుకోవాలంటే ఇంకా చాలా ఉల్లిగడ్డ దిగుమతి కావాల్సి ఉంది. మరోవైపు పెరిగిన ధరలతో ప్రజలు ఉల్లిగడ్డను తలుచుకోవాలంటేనే ఉలిక్కిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలా ఉంటాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Comments

comments