Home వనపర్తి బిసిలకు 54 శాతం రిజర్వేషన్లు కల్పించాలి..

బిసిలకు 54 శాతం రిజర్వేషన్లు కల్పించాలి..

54 percent reservation for the BC

కొత్తకోట: బిసిలకు 54 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిఎల్‌ఎఫ్ దేవరకద్ర నియోజకవర్గ కోకన్వీనర్ బొబ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బిసి కులాల నాయకులతో ఆయన సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బహుజనులకు రాజ్యాధికారం కల్పించేందుకు సహకరించాలని కోరారు. అన్ని కులాలకు సబ్‌ప్లాన్ నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. రజక సంఘం చంద్రయ్య, లక్ష్మయ్యయాదవ్, నాగన్న, కుర్మన్న, ఎర్రగొల్ల రాములు, విజయ్, రాములు, బాల్‌చంద్రయ్య, దళిత నాయకులు సుబ్బయ్య, బుడగ జంగాల నాయకులు పాల్గొన్నారు.