Home అంతర్జాతీయ వార్తలు బ్లూఫిల్మ్ చూస్తూ గుండెపోటుతో మృతి

బ్లూఫిల్మ్ చూస్తూ గుండెపోటుతో మృతి

Watching-Pornన్యూయార్క్ : లాప్‌టాప్‌లో బ్లూఫిల్మ్ చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన న్యూయార్క్‌లోని నార్త్ సెంట్రల్ బ్రాంక్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఆస్పత్రిలో పని చేసే 48 ఏళ్ల వ్యక్తి చనిపోయి ఉండగా తోటి ఉద్యోగులు గమనించారు. ఆ సమయంలో అతను పూర్తి నగ్నంగా ఉన్నాడని, అతడి ల్యాప్‌టాప్‌లో పోర్న్ చిత్రం నడుస్తూ ఉందని పోలీస్ వర్గాలు తెలిపాయి.
పుట్టుకతోనే అతడు గుండె సమస్యతో ఉంది, కొద్ది రోజుల క్రితమే అతనికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అతడు చనిపోయే సమయానికి పోర్న్ చూస్తున్నాడని, దాంతో ఎడ్రినలిన్ ఎక్కువై అతడు మరణించాడని స్వయానా అతడి తల్లి చెప్పారు. 50 ఏళ్ల వయసు దాటినవారు, బరువు ఎక్కువ ఉన్నవారికి లైంగిక కార్యకలాపాల సమయంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్య పరిశోధనలో తేలింది. 2008లో ఇంగ్లండ్‌లో క్రిస్ నికొలస్ అనే 23 ఏళ్ల యువకుడు కూడా పోర్న్ చూస్తూ గుండెపోటుతో మృతి చెందాడు.