Home భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రిలో భారీ వర్షం

భద్రాద్రిలో భారీ వర్షం

Heavy rain in Bhadradhri

పెద్ద ఎత్తున వీచిన ఈదురు గాలులు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
పొంగిపొర్లి వాగులు, కుంటలు
జలమయమైన రోడ్లు
రోడ్లపైకి కొట్టుకొచ్చిన డ్రైనేజీ చెత్తన

భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం వేళ నుండే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఈదురు గాలులు, గాలి దుమారం పెద్ద ఎత్తున లేచింది. ఒక్క సారిగా ప్రారంభమైన వర్షం ఏకధాటిగా గంటపాటు కురిసింది. పెద్ద ఎత్తున వర్షం పడటంతో డ్రైన్లు పొంగిపొర్లి చెత్తా చెదారం రోడ్లపైకి కొట్టుకొచ్చింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పెద్ద ఎత్తున రోడ్లపైకి నీళ్లు చేరడంతో రాకపోకలకు ఆటంకం వాటిల్లింది. ఈదురు గాలులు, వర్షం కారణంగా పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. గత మూడు రోజులుగా వాతావరణంలో చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లోసైతం వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది.