Home తాజా వార్తలు మహేశ్ హ్యాపీ మూమెంట్

మహేశ్ హ్యాపీ మూమెంట్

Mahesh-babu-ఎంత స్టార్‌డమ్ ఉన్న తారలైనా తమ పిల్లలతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. వారితో గడిపే సమయం వారి కెంతో స్పెషల్. తాజాగా మహేష్ కూడా పిల్లలతో ఎంతో ఆనందంగా గడిపాడు. మహేష్‌బాబు ముద్దుల కుమార్తె సితార ఇటీవలే మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. సితార మూడవ బర్త్‌డే సెలబ్రేష న్స్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలను మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడి యాలో రిలీజ్ చేసింది. ఈ ఫొటోలో బర్త్‌డే బేబి సితారతో కలిసి మహేష్‌బాబు కూడా క్యాండిల్ ఆర్పుతూ ఎంతో సంతోషంగా కనిపించారు. ఆయన సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్ ఫొటోలో ఉన్నారు. ఈ వేడుక ఎంతో హ్యాపీగా జరిగింది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన కుమార్తెతో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.