Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

మారనున్న మణుగూరు పట్టణ రూపురేఖలు

భద్రాద్రి పవర్‌ప్లాంట్‌తో మారనున్న మణుగూరు పట్టణ రూపురేఖలు

శరవేగంగా ప్లాంట్ నిర్మాణ పనులు
రూ. 5340 కోట్లతో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
ప్లాంట్ నిర్మాణ సమయంలో స్థానికులకు ఉపాధి
పరిహారంపై నిర్వాసితుల ఆందోళన!

manuguru-patanam-photoమణుగూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు, పినపాక మండలాల పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న 1080 మెగావాట్ల భద్రాద్రి పవర్‌ప్లాంట్ పనులు వేగవంతం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1030 కరాల్లో సు మారు రూ.5340కోట్ల వ్యయంతో 1080మెగావాట్ల పవర్‌ప్రాజెక్టును ఈ ప్రాం తంలో నిర్మించనుండటంతో మణుగూరు, పినపాక మండలాల రూపురేఖలు మారను న్నాయి. స్థానికంగా అనేక వేల మందికి నిర్మాణ సమయం లో ఉపాధి అవకాశాలు దక్కనుండటంతో ఈ ప్రాంత నిరుద్యోగులు ఆనందంలో ఉన్నారు.

పవర్‌ప్లాంట్ పనులను రెండున్నర సంవత్సర కాలంలో పూర్తి చేయాలనే ధ్యేయంతో కాంట్రాక్టర్లు బిహెచ్‌ఇఎల్ అధికారుల పర్యవేక్షణలో పనులను వేగవంతం చేస్తున్నారు. ఒకపక్క పవర్‌ప్లాంట్ నిర్మాణ పనులు చురుకుగా జరుగుతుండగా, మరో పక్క నిర్వాసితుల ఆందోళనలు కూడా తీవ్రతరం అవుతున్నాయి. ఈ ప్రాజెక్టు భూ నిర్వాసితులలో అనేక మందికి పరిహారం అందలేదని, పనులకు MANUGURU-04-04pఆటంకం కలిగిస్తూ ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇంకా సుమారు 300ల మందికి ప్యాకేజీలు అందాల్సి ఉందని నిర్వాసితులు వాపోతున్నారు. భూ నిర్వాసిత కుటుంబ యువతకు ఎటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వకుండా, పట్టా భూముల పరిహారం విషయంలో ఓ కొలి క్కి రాకుండా పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్ట డంపై నిర్వాసి తులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ యంత్రాంగం నిర్వాసి తుల సమస్యలను పరిష్కరించకుం డానే పవర్ ప్లాంట్ పనులు ప్రారంభించడం అన్యాయ మని, ప్రభుత్వం మనోభావాలను దెబ్బతీస్తుం దని నిర్వాసితులు వాపోతున్నా రు. పవర్‌ప్లాం ట్ రాకతో ఈ ప్రాంతం అభివృద్ధ్ది చెంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే సదు ద్దేశంతో భూములను ఇస్తే ప్రభుత్వం మాత్రం నిర్వాసితుల కడుపు కొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సందట్లో సడేమియా లాగా బినామీ నిర్వాసితులు రోజు MANUGURU-04-02pరోజుకు పుట్టుకొస్తున్నారని అర్హులైన నిర్వాసి తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాం గం నిర్వాసితుల ప్యాకేజీలు పూర్తి చేసిన తర్వాత పనులు ప్రారంభించి ఉంటే బినామీలు పుట్టుకొచ్చే అకకాశాలు ఉండేవి కావని పేర్కొంటు న్నారు. సమస్యను పరిష్కరించిన తర్వాతే నిర్మాణ పనులకు ముందుకు పోవాలని భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్వాసిత బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.MANUGURU-04-01p

Comments

comments