Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

 ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ

 ముస్లిం పేదపిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలల ప్రారంభానికి కృషి

01WLHNKT02P1హన్మకొండటౌన్: ముస్లింల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. హన్మకొండ జకార్య ఫంక్షన్‌హాల్లో ఈద్ మిలాప్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలోని ముస్లింల అభివృద్ధికి, సంక్షేమం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పేద ముస్లింల కోసం షాద్ మూబారక్, 12శా తం రిజర్వేషన్లు కలిపించిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.

రంజాన్ పురష్కరించుకుని హైదరాబాద్‌లో మునుపెన్నడు లేని విధం గా వందలాది మంది ముస్లిం సోదరులకు ఒకే చోట ఇఫ్తార్ విందులు ఇచ్చి గౌరవించారన్నారు. గత ప్రభుత్వాలు ముస్లింల పట్ల నిర్లక్షంగా వ్యవహరించారన్నారు. నూతన రాష్ట్రంలో సిఎం కెసిఆర్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మజీదుల అభివృద్ధి కోసం నిధులు కెటాయించారని తెలిపారు. అంతేకాకుండా ముస్లిం పేద పిల్లల చదువుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.

ముస్లింలు ఐక్యంగా తెలంగాణ పునర్మిమానంలో భాగస్వా ములు కావాలని ఆయన కోరారు. అనంతరం జిల్లాలోని వివిధ మజీదుల అభివృద్ధి కోసం కెటాయించిన రూ.50లక్షల విలువైన చెక్కులను ఉపముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు, జిల్లా ఇన్‌చార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కెల్లపల్లి రవీందర్‌రావు,టిఆర్‌ఎస్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ నయీమోద్దిన్‌లతో పాటు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments