Search
Thursday 15 November 2018
  • :
  • :

మేడారం జాతరపై తొలిఅడుగు

 క్షేత్రస్థాయి ప్రణాళికలు

 12న అధికారుల సందర్శన
 శాశ్వత నిర్మాణాలపై దృష్టి
 ప్రభుత్వానికి ప్రతిపాదనలు
 జిల్లా అధికారుల తొలి సమీక్ష

01WLWGL07P1వరంగల్: మేడారం సమక్క, సాలరమ్మ మహాజాత రపై వరంగల్ జిల్లా యంత్రాంగం తొలి అడుగు వేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఈ జాతర ఏర్పాట్లపై ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమయ్యారు. లక్ష లాది మంది భక్తులు తరలివచ్చే గిరిజన మహా జాతర కోసం ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలని భావిస్తున్నారు. ఏడు నెలల సమయం మాత్రమే ఉన్నందున రోడ్లు, డ్రైనేజీలు, సాన్నఘట్టాలు, మరుగుదొడ్లు, బస్సులు ఇతరత్రా ప్రాథమిక వసతుల కల్పిం చాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. ప్రతీ ఏటా జాతర సమీపించినప్పటికీ పనులు పూర్తి కాక భక్తులు ఇబ్బందులపాల వుతు న్నందున ఈ సారి ఉన్న సమయంలో ముం దుగానే ప్రణాళికలు రూపొందించి సకాలంలో అమలు చేయాలని యోచిస్తు న్నారు. ఈ ప్రణాళికలతో ప్రతిపాదనలు రూ పొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధమ వుతున్నారు.
తొలి అడుగు
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేడారం జాత రపై జిల్లా యంత్రాంగం తొలిఅడుగు వేసింది. ప్రధానమైన శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కరుణ శనివారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసింది. ఇంజనీరింగ్ విభాగాలైన ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్‌డబ్లూఎస్, పంచాయతీ, వి ద్యుత్, దేవాదాయ శాఖ, రెవిన్యూ అధికా రులతో సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి అవసరమైన ప్రణాళి కలు రూపొం దించాలని నిర్ణయించారు. కోట్లాది రూపాయల వ్యయంతో పనులు చేప ట్టనున్నందున వాటిని సక్రమంగా సకాలంలో అమలు చేసే విధంగా కార్యాచరణ ఉండాలని నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ శాఖలు ప్రణా ళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ సూ చించారు. ముఖ్యంగా పనుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
12 మేడారం సందర్శన
పనులకు అవసరమైన ప్రణాళిక రూపొందిం చడంలో భాగంగా జిల్లా అధికారులు ఈ నెల 12వ తేదీన మేడారం సందర్శించి పరిస్థితిని పరిశీలించాలని నిర్ణయించారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా టాయిలెట్స్ రూ.10 కోట్లతో ఏర్పాటు చేస్తున్నందున ఈ మెటిరి యల్‌ను ఇతర ప్రభుత్వ నిర్మాణాలకు వినియో గించాలని భావించారు. జాతర సం దర్భంగా చేపట్టే పనులు తర్వాత ఉపయో గపడే విధంగా చేపట్టాలని భావిం చారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, జిల్లా రెవిన్యూ అధికారి శోభ, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అమయ్‌కుమార్, ఆర్‌డిఒ మహేందర్‌జీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

comments