Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

మేడ్చల్ కలెక్టరేట్‌లో ఉల్లాస భరితంగా క్రీడోత్సవాలు

SPORTS

మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టరేట్ అధికారులు, జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన క్రీడోత్సవాలు ఉల్లాస భరితంగా సాగాయి. కలెక్టర్ ఎం.వి.రెడ్డి, జాయింట్ కలెక్టర్ కె.ధర్మారెడ్డి, మల్కాజిరి ఎంపీ సీఎచ్.మల్లారెడ్డి, మేడ్చల్, ఉప్పల్ ఎమ్మెల్యేలు ఎం.సుధీర్‌రెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్.ప్రభాకర్ తదితరులు క్రికెట్ క్రీడలలో పాల్గొని ఉత్సాహ పరిచారు. కలెక్టరేట్ జట్టుకు కలెక్టర్ ఎం.వి.రెడ్డి సారధ్యం వహించగా ప్రజా ప్రతినిధుల జట్టుకు ఎంపీ మల్లారెడ్డి సారధ్యం వహించారు. రెండు జట్ల మద్య జరిగిన మ్యాచ్‌లో కలెక్టరేట్ జట్టుపై ప్రజా ప్రతినిధుల జట్టు విజయం సాదించింది.

Comments

comments