Search
Wednesday 14 November 2018
  • :
  • :

మొలకెత్తని ముల్కనూర్ కల్తీ వరి ధాన్య విత్తనాలు

seeds-image

ఫర్టిలైజర్ షాపు ఎదుట రైతు అందోళన
వరిధాన్యం సీడ్‌లో కల్తీ ఉందని
నిర్ధారించిన వ్యవసాయ అధికారులు
ఎడిఎ,సిఐ హామీతో అందోళన
విరమించిన రైతులు

మనతెలంగాణ/జమ్మికుంట: నాణ్యమైన విత్తనాలు జమ్మికుంట పట్టణంలో లభిస్తాయని వస్తే నకిలీ వరిధాన్యం సీడ్ ఇస్తావా అంటూ ఫర్టిలైజర్ షాపు ని ర్వాహకున్ని నిలదిస్తే నీకుదిక్కున్న చోట చెప్పుకో అంటూ రైతును బెదిరించడంతో షాపు ఎదుట నకిలీ వరి విత్తనాలతో రైతులు ఆందోళనకు దిగిన సంఘటన సోమవారం పట్టణంలో చోటు చేసుకుంది. కాల్వశీరంపూర్ మండలం ఎదులపూరం గ్రామానికి చెందిన గట్టు సదయ్య తన వ్యవసాయ పొలంలో వరి నారు పోసేందుకు జమ్మికుంట పట్టణంలోని పవనసుత ట్రేడర్స్ ఫర్టిలైజర్ దుకాణంకు వచ్చి మంచి వరిధా న్యం సిడ్ కవాలని అడుగగా మూలక్కనూర్ సిడ్ బాగ ఉంటుందని షాపు నిర్వహకుడు తెలిపడంతో సదయ్య 2240రూపాయాలు చెల్లి చి ధాన్యం బస్తా కొనుగోలు చేశారు.ఇంటికి వెళ్ళి మొల్క అల్కుదామని చూడగా ధాన్యం బస్తాలో ఊనుక బియ్యం గింజలు మట్టి రావడంతో అందోళన చెందిన సదయ్య బస్తాతో వ చ్చి షాపు యజమాని నిలదియగా నికుదిక్కు ఉన్నచోట చెప్పుకో అంటూ బెదిరించా డు. నకిలీ సిడ్ అమ్ముతూ షాపు నిర్వహకుడు ప ట్టబడినవిషయం తెలుసుకున్న రైతు సంఘా ల నాయకులు రైతులు అందోళన చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ సిఐ సృజన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మా ట్లాడినప్పటికి అందోళన విరమించలేదు. న కిలీ విత్తనాలు పట్టణంలో విచ్చలవిడిగా అ మ్ముతున్నావ్యవసాయ అధికారులు పట్టించుకోవడంలేదని ఫర్టిలైజర్ షాపులతో వ్యవసా య అధికారులు కుమ్మక్కుఅయ్యారని ఆరోపిస్తు నినాదాలు చేశారు.సంఘటన విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారి గోవర్దన్ క్కడికి చేరుకుని సిడ్ పరిశీలించి రైతులకు న్యాయం చేస్తానని హామి ఇచ్చినప్పటికి అం దోళన విరమించలేదు.హుజురాబాద్ ఏడిఎ అదిరెడ్డి హుటహుటిన సంఘటన స్థలాని చే రుకుని ధాన్యం సిడ్ పరిశీలించారు.షాపు ని ర్వహకుని స్టాక్ బుకు తనిఖీ చేసిన ఏడిఎ మూల్కనూర్ సిడ్ బస్తాలను తనిఖీ చేయగా కల్తి ఉన్నట్లు గుర్తించారు. పవనసుత ఫర్టిలైజర్ షాపుకు 80బస్తాల సిడ్ రాగ 30బస్తాల సిడ్ రైతులకు అమ్మినట్లు గుర్తించారు. మిగిలిన 50బస్తాలను సిజ్ చేస్తున్నట్లు ఏడిఎ అదిరెడ్డి తెలిపారు.రైతులకు కల్తి విత్తనాలు కట్టబెడుతున్న షాప్ నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు,రైతులు డిమా ండ్ చేశారు.కల్తీ జరిగింది వస్తావమేనని కల్త్తీ సుకున్న రైతులకు న్యాయం చేస్తామని ఏడిఎ అదిరెడ్డి సిఐ సృజన్‌రెడ్డి రైతులకు హామీఇవ్వడంతో అందోళన విరమించారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించల మే లక్షంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని అయినప్పటికి కొంత మంది వారి పద్దతులు మార్చుకోవడం లేదని కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏడిఎ అదిరెడ్డి తెలిపారు.
మూల్కనూర్ సిడ్ ధాన్యం నాణ్యమైన విత్తనాలు ఉంటాయని రైతుల నమ్మకమని ఎం దుకో ఒక కూటు మొత్తం కల్తీ వచ్చినట్లు తెలిపారు.మూల్కనూర్ సిడ్ కంపెనీకి సమాచా రం ఇచ్చామని వారు సైతం వచ్చి పరిశీలిస్తారని తెలిపారు.అన్ని షాపులపై తనిఖీలు చేస్తామని మూల్కనూర్ సిడ్ ఎవరైన తీసుకవస్తే రై తులకు అమ్మవద్దని షాపు నిర్వహకులకు తె లిపినట్లు ఏడిఎ తెలిపారు.

Comments

comments