Home జిల్లాలు మోడల్ స్కూళ్లకు నిధుల లేమి

మోడల్ స్కూళ్లకు నిధుల లేమి

నిలిచిన నిర్మాణం

మోడల్ స్కూళ్లకు నిధుల లేమి

పదకొండు యూనివర్సిటీలకు విసిలు కరువు

02nlg0104fనల్లగొండ : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యార్థులం దరికి ఇంగ్లీష్‌లో విద్యా బోధన అందించేందుకు ఆదర్శ పాఠశాలలను నెలకొల్పింది. అందులో భాగంగానే జిల్లాలో రూ.99 కోట్ల వ్యయంతో 33 మోడల్ స్కూళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోవడంతో కాంట్రాక్టర్లు మోడల్ స్కూల్ నిర్మాణాలను నిలిపివేశారు. ఒక్కొక్క స్కూల్‌కు రూ.2కోట్ల 40 లక్షల చొప్పున కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పదకొండున్నర కోట్ల నిధులను చెల్లించక పోవడంతో కాంట్రాక్టర్లు అనేక ఇబ్బందులకు గురవు తున్నారు.

ఆదర్శ పాఠశాలలు, కస్తూర్భా పాఠశాలలు నిర్మిస్తున్న వాటికి కాంపౌడ్ వాల్స్ నిర్మించక పోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాలల నిర్మాణంతో పాటు కాంపౌడ్ వాల్స్‌ను నిర్మించాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం కేజి టూ పిజీ వరకు ఉచితంగా విద్య అందిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతుందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.

గత విద్య సంవత్సరం పూర్తి చేసినా, నేటి వరకు ఆ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయలేకపోయిందని విద్యార్థి సంఘాలు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి నిరసనలు తెలియ జేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు లేకపోలేదు. జిల్లాలో 33 ఆదర్శపాఠశాలలకు గాను కొన్ని పాఠశాలలు పూర్తికాగా మరికొన్ని పూర్తికాలేదు. త్రిపురారం మండలం లోని కంపసాగర్, ఆదర్శపాఠశాలకు రూ.23 లక్షలు, దేవరకొండ మండలం పెంచికల్‌పాహాడ్ స్కూల్‌కు రూ.18 లక్షలు నేటికి చెల్లించక పోవడంతో కాంట్రాక్టర్స్ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా తెలంగా ణలోని 11 యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్లను నియ మించ లేక పోయిందని ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వానికి విద్యా రంగం పై ఏ మాత్రం చిత్తశుద్ది ఉందో అర్ధమౌతుందని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే ఆదర్శ పాఠశాల లకు చెల్లించాల్సిన నిధులు కేటాయించి, విద్యార్థులకు పెం డింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.