Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

యూరప్‌లో నాగ్-కార్తీల మల్టీస్టారర్

Nagనాగార్జున-కార్తీల కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి నెలలో ప్రారంభమైన ఈ సినిమా ఎక్కడా ఆగకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈమధ్యే యూరప్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను మొదలుపెట్టిన టీమ్ ప్రస్తుతం షూటింగ్‌తో బిజీబిజీగా గడిపేస్తోంది. ఈ షెడ్యూల్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే… ఇప్పటికే పదిహేను రోజులకు పైనే ఫ్రాన్స్‌లో షూటింగ్ జరగగా, మరో పదిరోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఇక ఫ్రాన్స్‌లో షూటింగ్ స్పాట్‌లో దిగిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ… కార్తీ, తమన్నాలతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని నాగార్జున తెలిపారు. యూరప్ షెడ్యూల్‌లో తెలుగు సినిమాల్లో ఇంతవరకు చూడనటువంటి ఓ భారీ యాక్షన్ సీన్‌ను ప్లాన్ చేశారు. షూటింగ్ స్పాట్‌లో నాగార్జున, కార్తీ, తమన్నాలు సరదాగా దిగిన ఫొటో ఎంతో కూల్‌గా ఉంది.

Comments

comments