Home తాజా వార్తలు రక్తదానం చేస్తున్న విద్యార్థులు

రక్తదానం చేస్తున్న విద్యార్థులు

31MDPTC02మెదక్ : సమాజ సేవలో యువత ముందుండాలని గీతం విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ శివప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గీతం విశ్వవిద్యాలయం ఇంజినీర్స్ వితౌట్ బార్డర్స్ విద్యార్థులు రెడ్‌క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిభిరం నిర్వహించారు. విద్యార్థులు ముందుకు వచ్చి రక్తదానం చేయాలన్నారు. సమాజంలో ప్రతి రోజు ఎంతో మంది రక్తహీనతతో మరణిస్తున్నారని తెలిపారు. అలాంటి వారికోసం యువత రక్తదానం చేయడంలో ముందుండాలని సూచించారు. సుమారు 500 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితిల్లో ప్రాణాలు కొల్పోతున్న వారిని ఆదుకుంటున్న రెడ్‌క్రాస్ సొసైటీని అభినందించారు.