Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

రాజీవ్ రహదారిపై మంచినీటి గోస

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
కొండపాక, కుకునూర్‌పల్లిలలో మహిళల ఆందోళన, రాస్తారోకో
నిలిచిపోయిన వాహనాలు

01mdsdpp1కొండపాక : మంచినీటి గోసతో మహిళలు ఖాళీ బిందెలతో రో డ్డెక్కా రు. దీంతో జాతీయ రహదారిపై ఎక్క డి వాహనాలు అక్కడే నిలిచిపోయా యి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ని యోజకవర్గంలోని కొండపాక, కుకు నూర్‌పల్లి గ్రామాలలో మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశా రు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ్పందించడంలేదన్నారు. దీంతో శనివారం ఉదయం కుకునూర్‌పల్లి బిసి కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

సమస్యను గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ముఖ్యమంత్రి అభివృద్ధి పనులు చేస్తు న్నా నాయకులు మాత్రం మా తాగునీటి గోస పట్టించకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గంట పాటు ఆందోళన చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. గ్రామ స ర్పంచ్ అయిలం యాదవ్ త్వరలో సమ స్య పరిష్కరిస్తామని చెప్పినా వినలేదు. చివరికి ఎస్‌ఐ, నేతల జోక్యంతో వారు ఆందోళన విరమించడంతో పోలీసు లు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నా రు.
కొండపాకలో ..
01mdsdpp6మండల కేంద్రమైన కొండపాకలోని బిసి, ఎస్‌సి కాలలనీకి చెందిన మహిళలు మంచినీటి సమస్యపై సర్పంచ్ తీరును ని రసిస్తూ కొండపాక స్టేజీ వద్ద ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వ హించారు. ఎన్ని మార్లు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించు కోవడం లేదని వారు వాపోయా రు. మంచినీటి సమస్యపై మహిళలు రోడ్డెక్కడంతో కొంత సేపు రాజీవ్ రహదా రిపై రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు ఎన్నో వరాలు ఇస్తున్నారని, ఇక్కడ మంచినీటి సమస్య పరిష్కరించడం లేదా…అని ప్ర యాణికులు ముచ్చటించుకోవడం కనిపించింది.

Comments

comments