Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన మహోన్నతుడు కలాం

04KMTLD02P3ఖమ్మం: రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహోన్నతుడు అబ్దుల్ కలాం అని మండల విద్యాశాఖాధికారి ఎన్.దామోదరప్రసాద్ అన్నారు. స్థానిక బాలభారతి విద్యాలయంలో సోమవారం రాత్రి మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత క్షిపణి శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ ఎపిజె.అబ్దుల్‌కలాంకు విద్యార్దులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు క్రొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంఇఒ హాజరయి మాట్లాడుతూ అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా మన దేశానికి సేవలందించారన్నారు. కెఎస్‌ఎం విద్యాసంస్ధల కరస్పాండెంట్ కోటగిరి ప్రవీణ్ మాట్లాడుతూ శాస్త్రవేత్తగా కలాం దేశానికి, రక్షణ రంగానికి సేవలందించటం వలన ఆయన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కీర్తిగడించారన్నారు. ఈ కార్యక్రమంలో కెఎస్‌ఎం కళాశాల ప్రిన్సిపాల్ టి.రామారావు, దాసరి వీరభధ్రరావు యూత్‌క్లబ్ అధ్యక్షుడు డి.అజయ్‌కుమార్, సీనియర్ ఉపాధ్యాయుడు డి.నరేంద్రరాజు, ప్రధానోపాధ్యాయురాలు గౌసియా తదితరులు పాల్గొన్నారు.

Comments

comments