Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

రెండు పథకాలకు మధ్య తేడా ఏంటి?

మన ఊరు – మన ప్రణాళిక ప్రతిపాదనలు ఏమయ్యాయి

మరో కొత్త పథకంతో ప్రజలను మోసం చేస్తున్న సిఎం కెసిఆర్
ఎన్నికల హామీలు 10 శాతం కూడా అమలు చేయలేదు
సమ్మెలు చేస్తున్నా కార్మికుల సమస్యలు పట్టడం లేదు
సచివాలయానికి రాకుండా ఫామ్‌హౌజ్ నుంచి పాలన
కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు

31KNR05-P-1కరీంనగర్ టౌన్‌ః గత ఏడాది ప్రారంభించిన మన ఊరు-మన ప్రణాళికలో అందజేసిన సమస్యల పరిష్కారాన్ని పక్కనపెట్టి గ్రామ పంచాయితీలను అభివృద్ధి పరిచేందుకు ప్రవేశపెట్టనున్న మరో కొత్త ‘గ్రామజ్యోతి’కి తేడా ఏంటో చెప్పాలని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్ లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్‌లో గ్రామాలు ఏ విధంగా ఉండిపోతాయోనని కేబినెట్‌లో చర్చించి గ్రామజ్యోతి ఏర్పాటుకు సన్నద్ధం చేస్తున్న సిఎం మన ఊరు-మన ప్రణాళికలో 60 వేల 309 పనులకు ప్రతిపాదనలు వస్తే వాటిని పక్కన పెట్టి మరో కొత్త పథకంతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మహామనిషి అబ్దుల్ కలాం మరణిస్తే ఆయనను చూడడానికి వెళ్లకుండా పాలన కొనసాగిస్తున్నారా అని విస్మయం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆరోగ్యశ్రీ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు సమ్మెలు చేస్తుంటే ఎందుకు వారి సమస్యలను పరిష్కరించడం లేదని నిలదీశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఇప్పటివరకు 10 శాతం కూడా అమలు చేయలేదని విమర్శించారు.

సిఎం కెసిఆర్ పూటకో మాట మాటల గారడితో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. 39 వేల కోట్ల రూపాయల గ్రామజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టే ముందు గతంలో మన ఊరు-మన ప్రణాళికలో 39 వేల 33 కోట్ల పనులకు వచ్చిన ప్రతిపాదనలు, వాటి ప్రణాళిలు ఏమయ్యాయే చెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ పాలన గురించి తెలంగాణ ప్రజలకు అర్థం అవుతోందని, సచివాలయానికి రాకుండా ఫామ్‌హౌజ్ నుండి పాలన కొనసాగిస్తున్న తీరును గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జీ చల్మెడ లక్ష్మీనరసింహారావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గుగ్గిళ్లపు జయశ్రీ, పార్టీ నగర అధ్యక్షులు కర్ర రాజశేఖర్, నాయకులు గందే మాదవి, సరిళ్ల ప్రసాద్, ఆమ ఆనంద్, మాచర్ల ప్రసాద్, తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌పై స్టే ఎందుకు
ఓటుకు నోటు కేసులో ఎపి సిఎం చంద్రబాబు నాయుడును అనేక మార్లు విమర్శించి ఫోన్ ట్యాపింగ్ విషయంలో స్టే ఎందుకు తెచ్చుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. బాబును తిట్టిన కెసిఆర్ ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉంటున్నారో చెప్పాలని డిమండ్ చేశారు.

Comments

comments