Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి

06RRGTKP02రంగారెడ్డి : రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో బీహార్‌కు చెందిన డ్రైవర్ మృతి చెందాడు. మరో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.. ఎస్సై వీరభద్రయ్య తెలిపిన వివరాలు ప్రకారం.. బీహార్‌కు చెందిన ఎం.రాకేష్(౩౦) రామగుండెంలో నివాసం ఉంటూ 18 చక్రల లారీని నడుపుతున్నాడు. గురువారం తెల్లవారుజామున కీసర నుంచి ఘట్‌కేసర్ కు వస్తుండగా ఘట్‌కేసర్ నుంచి కీసర వైపు వెళ్తున్న చిన్న కంకర లారీ ఎదురుగా అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో రాకేష్ అక్కడిక్కడనే మృతి చెందాడు. మరో లారీ డ్రైవర్, క్లీనర్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Comments

comments