Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

లవ్‌స్టోరీ మధ్య మామా అల్లుళ్ల వినోదం

Cinema Choopistha Maavaఆర్యత్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్, లక్కీ మీడియా పతాకాలపై రాజ్‌తరుణ్, అవికాగోర్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్, ఆర్.డి.జి. ప్రొడక్షన్స్ ప్రై.లి. సమర్పణలో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘సినిమా చూపిస్త మావ’. బోగది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని ఈనెల 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి రాజ్ తరుణ్, రావు రమేష్ విలేకరులతో ముచ్చటించారు. రావు రమేష్ మాట్లాడుతూ “ఈ సినిమాలో సోమనాథ్ చటర్జీ అనే బెంగాలీ వ్యక్తి పాత్రలో నటించాను. సాయిశ్రీరాం ఫొటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుంది. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్‌నిచ్చారు. ప్రతి పాట అద్భుతంగా వచ్చింది. రాజ్‌తరుణ్ మాస్ ఇమేజ్ క్యారెక్టర్‌లో సూపర్బ్‌గా నటించాడు. నాన్నగారు (రావుగోపాల్ రావు), చిరంజీవి మామ అల్లుళ్ల పాత్రల్లో నటించిన చిత్రాలు ఎంత సక్సెస్ అయ్యాయో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అవుతుంది. త్రినాథరావు బాగా డైరెక్ట్ చేశాడు. ప్రతి డైలాగ్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. దిల్‌రాజు సినిమా చూసి ఎంతో బావుందని చెప్పారు. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్‌హిట్ అవుతుంది”అని అన్నారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ “సంవత్సరంన్నర పాటు కష్టపడి చేసిన చిత్రమిది. దర్శకుడు త్రినాథరావు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మామ క్యారెక్టర్‌లో రావు రమేష్ అద్భుతంగా నటించారు. సినిమాలో పాటలన్నీ కొత్తగా ఉంటాయి. పిల్లికళ్ల పాప అనే సాంగ్ నాకు బాగా నచ్చింది. ఓ మంచి లవ్‌స్టోరీకి మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘ఉయ్యాల జంపాల’ చిత్రం తర్వాత అవికాగోర్ నేను కలిసి ఈ చిత్రంలో నటించాం. మా ఇద్దరి మధ్య ఈ సినిమాలో మంచి కెమిస్ట్రీ కుదిరింది. ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను”అని చెప్పారు. బ్రహ్మానందం, రావు రమేష్, తోటపల్లి మధు, కృష్ణభగవాన్, పోసాని కృష్ణమురళి, జయలక్ష్మి, మాధవి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలుః ప్రసన్న జె.కుమార్, ఎడిటింగ్‌ః కార్తీక శ్రీనివాస్, సినిమాటోగ్రఫీః సాయి శ్రీరామ్-దాశరధి శివేంద్ర.

Comments

comments