Home రాష్ట్ర వార్తలు వందల్లో సీట్లు.. వేలల్లో దరఖాస్తులు

వందల్లో సీట్లు.. వేలల్లో దరఖాస్తులు

బిసి గురుకులాలకు పెరుగుతున్న డిమాండ్
మరో 50 విద్యాలయాల ఏర్పాటు ప్రతిపాదనలపై సిఎం వద్ద ఫైల్

BC-Welfare-Departmentమన తెలంగాణ/ హైదరాబాద్:  మహాత్మా జ్యోతిరావు పూలే బిసి సంక్షేమ విద్యాలయాలకు డిమాండ్ పెరుగుతోంది. గురుకుల విద్యాలయాల్లో వందల్లో ఉన్న సీట్లకు వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని గురుకులంలో 320 సీట్లకు గాను ఏకంగా 5 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో ఆర్థమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 23 గరుకుల పాఠశాలలు, 3 జూనియర్ కళాశాలలు, ఒక డిగ్రీ కళాశాల ఉన్నాయి. బోధన, సౌక ర్యాలు వంటి విషయంలో మంచి ఫలితాలు కనబరుస్తుండ టంతో ఈ గురుకులాల్లో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. 5వ తరగతి నుంచి 10 వరకు ఇంగ్లీషు మీడియం స్కూళ్లకు దీటుగా గురుకులాలు మెరుగైన ఫలి తాలు సాధిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా మహబూబ్ నగర్, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో గల గురుకులాలకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని బిసి గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. కాగా, మరో 50 గురుకులాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా ప్రస్తుతం ఫైల్ సిఎం వద్ద పెండింగ్‌లో ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం నాలుగు గురుకులాలు ఉన్నప్ప టికీ ఎక్కువ డిమాండ్ ఈ జిల్లా నుంచే వస్తోంది. మరోవైపు ఇంటర్, డిగ్రీ కళాశాలకు భారీ స్థాయిల్లోనే దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఎక్కువగా నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌లో 945 మంది, మెదక్ జిల్లాలోని దౌలతాబాద్ గురుకులంలో 654 మంది విద్యార్థులు ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్క గురు కులమూ లేదు. దీనికి ప్రధాన కారణం స్థలం లేకపోవడ మేనని సమాచారం. గతంలో ఒక్కో గురు కులానికి కనీసం 40 ఎకరాల స్థలం ఉండాలనే నిబంధన ఉండేది. దానిని ప్రస్తుతం 10 ఎకరాలకు కుదించారు. అయినప్పటికీ హైదరాబాద్‌లో పది ఏకరాల స్థలం కావాలంటే కష్టంగా మారడంతో పెద్ద అడ్డంకిగా ఉన్నట్టు తెలుస్తోంది.
బిసి సంఘాల నుంచి డిమాండ్లు
రాష్ట్రంలో జనాభా ప్రతిపాదికన గురుకులాలు ఏర్పాటు చేయాలని పలు బిసి సంఘాల నుంచి డిమాండ్లు వ్యక్తమ వుతున్నాయి. సిఎం కెసిఆర్ 103 గిరిజన గురుకులాల ను, 30 డిగ్రీ కళాశాలకు, మైనారిటీ విద్యార్థుల కోసం 70 గురుకులాలను ప్రకటించడమే దీనికి కారణం. బిసి విద్యార్థులకు కూడా జనాభా ప్రాతిపాదికన గురుకులాలు ఏర్పాటు చేయాలని బిసి సంఘాలు కోరుతున్నాయి.
సిఎం సమీక్షతో విద్యాలయాల పెంపుపై ఆశలు
బిసి గురుకులాల ఏర్పాట్లపై సిఎం తన కార్యాలయంలో గురువారం బిసి సంక్షేమ శాఖతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త గురుకులాల పెంపు, ప్రస్తుతం ఉన్న విద్యాలయాలను కళాశాలలుగా మార్చేందుకు సిఎం సానుకూలంగా స్పందించారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 26 గురుకులాలు ఉండగా, వాటిని 50 వరకు, 16 గురుకులాలను కళాశాలుగా అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది.