Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

వాన లేక వాయిదా!

హరితహారాన్ని వాయిదా వేసిన బల్దియా
సిద్ధంగా ఉన్న మొక్కలు
నాటేందుకు వర్షాభావం అడ్డంకి
వరుణుని కరుణ కోసం ఎదురుచూపు

NJ-02(04-08)-PHOTO-1సిటీబ్యూరో: మొక్కలు సిద్ధంగా ఉన్నాయి… కానీ నాటేందుకు పరిస్థితులు అనుకూలిం చడం లేదు. వానలు కాలనుగుణంగా కురియకపోవడంతో మొక్కలు నాటే పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నగరంలో నెలకొంది. వర్షాలు కురియకపోవడంతో మొక్కలు నర్సరీలకే పరిమితమయ్యాయి. తెలంగాణ హరితహారం పేరిట పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం జిహెచ్‌ఎంసికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ హరితహారం పథకం కోసం మొక్కలు నాటేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు అన్నీ సిద్ధం చేశారు. కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో మొక్కలు నాటితే ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. మొక్కలు నాటినా బ్రతికే పరిస్థితులు ఉండవని జిహెచ్‌ఎంసి అధికారులు హరితహారం కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇక వర్షాలు కురిస్తేనే నగరంలో హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి దశలో గ్రేటర్ హైదరాబాద్‌లో 50 లక్షల మొక్కలు నాటాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. అందుకోసం 23.42 లక్షల మొక్కలు సిద్ధం చేశారు. మొక్కలు నాటేందుకు 70 ప్రాంతాలను గుర్తించారు. 23 లక్షల మొక్కలు నాటిన అనంతరం 27 లక్షలు నాటాలని నిర్ణయించారు. ఇందుకుగాను 105 పనులను చేప ట్టాలని నిర్ణయించారు. ఈ 105 పనులకు టెండర్లు సైతం ఆహ్వా నించి, పనులను ఖరారు చేశారు. అయితే మొక్కలు నాటేందుకు గుం తలు సైతం తవ్వించారు. సర్వం సన్నద్ధం చేశాక వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. తీవ్రమైన వర్షాభావ పరిస్థి తుల్లో మొక్కలు నాటితే ప్రయోజనం ఉండదని, వాటిని నర్సరీల్లోనే సంరక్షిస్తున్నారు. ఎప్పుడు వర్షాలు కురిస్తే అప్పుడు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. చివరకు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వరుణుడు కరుణించే వరకు మొక్కలు నాటేందుకు వేచిచూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

Comments

comments