Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

వారియర్ క్వీన్‌గా ‘రుద్రమదేవి’

Rudhramadeviఅనుష్క టైటిల్ రోల్‌లో నటిస్తున్న ‘రుద్రమదేవి’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ స్టిల్‌లో అనుష్క.. వారియర్ క్వీన్‌గా దర్శనమిస్తోంది. నల్లరంగు చీరలో చేతిలో కత్తి, డాలు పట్టుకొని యుద్ధానికి సిద్ధంగా ఉన్న రాణిగా అనుష్క అదరగొడుతోంది. శతృవులను చీల్చి చెండాడడానికి కదనరంగంలో నిలబడి ఉన్న ‘రుద్రమదేవి’ అందరినీ ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాకతీయ సామ్రాజ్య రాణి ‘రుద్రమదేవి’ జీవితగాథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. సినిమా పాటలు, ట్రైలర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చింది. అల్లుఅర్జున్, కృష్ణంరాజు, రానా దగ్గుబాటి, ప్రకాష్‌రాజ్, ఆదిత్య మీనన్, నిత్యామీనన్, బాబా సెహగల్, క్యాథరిన్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ నీతాలుల్లా కాస్టూమ్స్‌ను డిజైన్ చేసింది.

Comments

comments