Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

వ్యర్థానికి అర్ధం!

పునర్ వినియోగంలోకి భవన నిర్మాణ వ్యర్థాలు

నగరంలో ఢిల్లీ తరహాలో ప్లాంట్
టెండర్లు ఆహ్వానించిన బల్దియా

DSC_9428సిటీబ్యూరో: వ్యర్థాలను పునర్ వినియోగించుకోవాలని మ హానగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి) నిర్ణ యించింది. నిర్మాణ వ్యర్థాలను తొలగించ డంతో పాటు పునర్ వినియోగంలోకి తీసుకు రావాలని అధికారులు నిర్ణయించారు. భవన నిర్మాణ వ్యర్థాలను నిర్మూలించే విషయం జి హెచ్‌ఎంసి తలనొప్పి వ్యవహారంగా మారిం ది. భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించేందు కు ప్రతినెలా లక్షలాది రూపాయలను బల్ది యా అధికారులు వెచ్చిస్తున్నారు. వ్యర్థాలను తొలగించేందుకు ఇంత డబ్బు పోస్తున్నా, వాటిని నిక్షిప్తం చేసేందుకు అనువైన స్థలం కూడా లభించడం లేదు.

ఇప్పటివరకు జవ హర్‌నగర్ డంపింగ్‌యార్డు, లేదా శివారు ప్రాంతాల్లో ఉన్న క్వారీలలో భవన నిర్మాణ వ్యర్థాలను పడేస్తున్నారు. స్థానిక ప్రజలు వ్యర్థాలను తమ ప్రాంతాల్లో వేయవద్దని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిహెచ్‌ఎంసి ఆర్థిక భారంతో పాటు, వ్యర్థాలను నిక్షిప్తం చేసేందుకు స్థలం లభించక పోవడంతో అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఎదు రవుతోంది. ఈ క్రమంలో భవన నిర్మాణ వ్యర్థాలను శాశ్వతంగా నిర్మూలించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో భవన నిర్మాణ వ్యర్థాలను శాశ్వతంగా నిర్మూలించే ప్రక్రియను ప్రారంభిం చారు. ప్రత్యేకంగా ప్లాంట్ ఏర్పాటు చేశారు. భవన నిర్మాణ వ్యర్థాలను పునర్ వినియోగిస్తున్నారు. ఇటుకలు, టైల్స్, బ్రిక్స్ లాంటివి తయారు చేస్తున్నారు. నిర్మూలనతో పాటు పునర్ విని యోగంతో రెండు విధాలుగా ఉపయోగపడుతున్న విధానాన్ని అమలు చేస్తున్నారు.

DSCF4748ఈ విధానం ఉభయ తారకంగా ఉండటంతో నగరంలో కూడా అమలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా గత జూన్ మాసంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజా ప్రతినిధులు, జిహెచ్‌ఎంసి అధికారులు ఢిల్లీని సందర్శించారు. భవన నిర్మాణ వ్యర్థాలను నిర్మూలిస్తున్న విధానాన్ని పరిశీలించారు. అక్కడ భవన నిర్మాణ వ్యర్థాలను పూర్తిగా నిర్మూలిస్తున్నారు. దీనివల్ల వ్యర్థాలను పారబోసేం దుకు స్థలం అవసరం లేకుండా పోతోంది. ఆ చెత్త తిరిగి విని యోగంలోకి కూడా వస్తుంది. ఢిల్లీ తరహాలోనే గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా భవన నిర్మాణ వ్యర్థాలను పునర్ వినియోగంలోకి తీసుకువచ్చే విధానం అమలు చేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ సోమేశ్‌కుమార్ నిర్ణయించారు. ఇందు కోసం ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.

నగర శివారులో వ్యర్థాల నిర్మూలన, పునర్ వినియోగానికి శివారు ప్రాం తంలో స్థలాన్ని కేటాయిస్తారు. రోడ్డుకు ఇరువైపులా ఉండే నిర్మాణ వ్యర్థాలు తీసుకుపోయేందుకు జిహెచ్‌ఎంసి డబ్బులు చెల్లిస్తుంది. వ్యర్థాలను తీసుకుపోయేందుకు నిర్మాణ దారులు డబ్బులు చెల్లించే విధంగా నిబంధనలు తీసుకురానున్నారు. సేకరించిన వ్యర్థాలను పునర్ వినియోగంలోకి రావడం కోసం ప్రత్యేకమైన ప్లాంట్ ఏర్పా టు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జిహెచ్ ఎంసి ఇటీవలనే టెండర్లు ఆహ్వానించింది. ఆహ్వానించిన టెండర్లకు బిడ్డర్ల నుంచి సానుకూలమైన స్పందన వచ్చినట్లు తెలిసింది. నిర్మా ణ వ్యర్థాల ప్లాంట్ ఏర్పాటైతే బల్దియాకు తలపోటుగా మారిన భవన నిర్మాణ వ్యర్థాల నిర్మూలన భారం నుంచి విముక్తి కలుగుతుంది.

Comments

comments