Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

‘శ్రీమంతుడు’ క్వాలిటీ కోసం నిర్మాతనయ్యా…

Mahesh Babuమహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ మరో వారం రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి మహేష్ సహ నిర్మాతగానూ వ్యవహరించడం సినిమా పోస్టర్ రిలీజ్ అప్పటినుంచీ ఆసక్తికరంగా మారిన అంశం. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెట్ ప్రై.లి. పేరుతో మహేష్ ఓ ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టాడు. ఈ బ్యానర్‌పై మొదటి సినిమాగా మహేష్ ‘శ్రీమంతుడు’ను మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మించారు. ఇక నిర్మాతగా తన ప్రయాణం గురించి మహేష్ మాట్లాడుతూ… “సినిమా క్వాలిటీ కోసం ప్రొడక్షన్‌లోకి దిగాను. సినిమా అనేది క్రియేటివ్ వరల్డ్. సినిమా నిర్మాణ సమయంలో క్వాలిటీ విషయంలో రాజీపడే అవకాశం లేకుండా, నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందన్న నేపథ్యంలోనే నేను నిర్మాతగా మారా. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకూడదన్న మేజర్ అజెండాతోనే నిర్మాతనయ్యా”అని పేర్కొన్నాడు. తన తర్వాత సినిమా ‘బ్రహ్మోత్సవం’కు కూడా మహేష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ‘శ్రీమంతుడు’ డైరెక్టర్ కొరటాల శివ చెప్పిన వివరాల ప్రకారం మొదట్లో మహేష్ ప్రొడక్షన్ హౌస్ లోగోను భారీ ఎత్తున విడుదల చేయాలని ప్లాన్ చేశారట. అయితే మహేష్ అలాంటివేమీ వద్దని చెప్పడంతో టీజర్‌తో పాటు లోగోనూ విడుదల చేశామని శివ తెలిపాడు. ఇక ‘శ్రీమంతుడు’ పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని ఫస్ట్‌కాపీ సిద్ధమై సెన్సార్‌కు వెళ్లింది.

Comments

comments