మహేష్, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, ఎంబి. ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్లు కలిసి భారీ బడ్జెట్తో రూపొందించిన చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎటువంటి కట్స్లేకుండా ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ను ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ మాట్లాడుతూ “మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ చిత్రం సెన్సార్ పూర్తయింది. ఎటువంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ని రూపొందించారని దర్శకుడు కొరటాల శివను సెన్సార్ సభ్యులు అభినందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం”అని అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, శివాజీరాజా, కాదంబరి, ముకేష్ రుషి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః మది, సంగీతంః దేవిశ్రీ ప్రసాద్, పాటలుః రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్ః రాజు సుందరం, దినేష్, బాస్కో సీజర్, ఎడిటింగ్ః కోటగిరి వెంకటేశ్వరరావు.