Home ఖమ్మం సంస్కృతికి, సంపదకు నెలవు ఖమ్మం

సంస్కృతికి, సంపదకు నెలవు ఖమ్మం

రోటరీక్లబ్ ఆఫ్ స్తంభాద్రి కార్యక్రమంలో సిఎం కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్

2-Cultural-Item-No.-3ఖమ్మంకల్చరల్: తెలంగాణా జాతికి అపారమైన సంపదను, సంస్కృతిని ఇచ్చేది ఖమ్మమేనని, తెలంగాణ చరిత్ర రాయాల్సి వస్తే ఖమ్మం నుండే ప్రారంభించాలని తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ అ న్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని కిరాణాజాగిరి మర్చం ట్స్ హాలులో జరిగిన రోటరీక్లబ్ ఆఫ్ స్తంభాద్రి నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసం గించారు. తెలంగాణా ఉద్యమంలో తొలి నిప్పురవ్వ రాజేసింది ఖమ్మంలోనేన్నారు. సేవకు మరోపేరుగా నిలిచే రోటరీక్లబ్ ఆధ్వ ర్యంలో ఖమ్మంలో దాశరధీ సోదరులు విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

సంపాదనంలో కొంత భాగా న్ని సమాజసేవకు కేటాయించేందుకు ఇలాంటి క్లబ్‌ల ద్వారా పూనుకోవటం గొప్పవిషయమన్నారు. ఎంపి పొంగులేటి శ్రీని వాసరెడ్డి మాట్లాడుతూ రోటరీక్లబ్ చేస్తున్న కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. అనంతరం రోటరీక్లబ్ ఆఫ్ స్తంభాద్రి అధ్యక్షులు గుర్రం సతీష్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా కాకరపర్తి రాంప్రతాప్, కోశాధికారిగా మైలవరపు సతీష్‌కుమార్‌లు ప్రమాణం చేసారు.ఈకార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మేళ్లచెర్వు వేంకటేశ్వరరావు, టి న్యూస్ ఛానల్ ఛీఫ్ పివి శ్రీనివాస్, రోటరీనగర్ ప్రతినిధులు కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, పాలవరపు శ్రీనివాస్, వేములపల్లి సీతా రాం బాబు, పుల్లఖండం సురేష్, మాజీ అధ్యక్షలు ఎంవి నగేష్, వెంపటి సత్యనారాయణ పాల్గొన్నారు. తానా సభకు వెళ్లొచ్చిన ఫోటోగ్రాఫర్ నాగరాజు దేవ రకు సన్మా నంతోపాటు, నూతన సభ్యుల ప్రమాణస్వీకారం కూడా జరిగింది.