Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

సయేషాతో అఖిల్ లిప్‌లాక్

Akhilఅక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతున్న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అక్కినేని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. హ్యాండ్‌సమ్ హీరో అఖిల్‌ను ఎప్పుడు తెరపై చూస్తామా అని తాపత్రయపడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆగస్టు 29న, ఆడియోను సెప్టెంబర్ 20న, మూవీని అక్టోబర్ 21న విడుదల చేస్తారని తెలిసింది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ బాగా ఉండడం విశేషం. హీరోయిన్‌గా పరిచయమవుతున్న సయేష్ సైగల్‌తో అఖిల్ లిప్‌లాక్ సీన్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందట. సయేష్ అందాలు, హాట్ భామ ఇలియానా స్పెషల్ సాంగ్ కుర్రకారును వెర్రిక్కిస్తాయట. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. అఖిల్ ఫైట్ సీక్వెన్స్, డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను అదరగొడతాయి. రొమాన్స్, కామెడీతో కూడుకున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఎస్‌ఎస్ తమన్, అనూప్‌రూబెన్స్‌లు కలసి సంగీతమందిస్తుండడం విశేషం.

Comments

comments