Search
Sunday 18 November 2018
  • :
  • :

‘సర్దార్’ ఫస్ట్‌లుక్

Sardaar‘సర్దార్’ సినిమా షూటింగ్‌లో పవన్‌కళ్యాన్ పాల్గొంటున్నాడు.రెండో షెడ్యూల్‌లో ఆయన పాల్గొనడంతో సినిమాకు ఊపు వచ్చింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ‘సర్దార్’ నిర్మాత శరత్ మరార్ ట్విట్టర్‌లో సర్దార్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాడు. పవన్ సైతం తన మైక్రో బ్లాగింగ్ పేజీలో ఈ ఫస్ట్‌లుక్‌ను అభిమానుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ స్టిల్‌లో పవన్‌కళ్యాణ్ పోలీస్ రోల్‌లో కనిపిస్తాడు. రౌడీలు పవన్ కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉంటారు. ఈ స్టిల్‌లో పవన్ వెనకనుంచి కనబడుతుండగా అతని పక్కన గుర్రం నిలబడి ఉంటుంది. ఈ సీన్‌లో డేరింగ్ డాషింగ్ పవన్‌కల్యాణ్… పంచ్ డైలాగ్స్ వినిపించడం ఖాయం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు ఈ చిత్రానికి. సతీష్ వేగేశ్న, సాయిమాధవ్ బుర్రా, ఇద్దరు యంగ్ రైటర్స్, దర్శకుడు బాబీలు కలిసి స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఫిల్మ్‌మేకర్స్ ‘సర్దార్’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Comments

comments