Search
Saturday 22 September 2018
  • :
  • :

సాగర్‌లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు

Possible plastic waste in Sagar

మన తెలంగాణ/సిటీబ్యూరో: విశ్వనగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాల్సిన హుస్సేన్‌సాగర్ కాలుష్య కోరల్లో చిక్కుకొని కంపుకొడుతోంది. పర్యాటకులు కనువిందు చేయాల్సిన నెక్లెస్‌రోడ్డు చుట్టూ తీరం ప్లాస్టిక్ వ్యర్థాలతో మురుకికూపంగా మారింది. ఎంతో ఆశగా వచ్చే పర్యాటకులు ఈ అంధవికార దృశ్యాలను చూడలేకపోతున్నారు. నిత్యం టన్నులకొద్ది వ్యర్థాలను తరలిస్తున్నామని, అడుగడుగునా పొడిచెత్త, తడిచెత్త ప్రత్యేక చెత్తబుట్టలను ఏర్పాటు చేశామని బల్దియా అధికారులు చెబుతున్నప్పటికీ సాగర తీరాన ఇంతలా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాల్సిన హెచ్‌ఎండిఎ అధికారులకు సాగరతీరం చెత్త చెదారంతో నిండిపోయిన కనిపించక పోవటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వ్యర్థాలను తొలగించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాల్సిందిగా పర్యాటకులు కోరుతున్నారు.

Comments

comments