Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

స్కూల్ బస్సు ఢీకొని బాలిక మృతి

Accidental School Bus small girl Died
కమ్మర్‌పల్లి: ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్ని 2 సంవత్సరాల చిన్నారి మరణించిన సంఘటన కమ్మర్‌పల్లి మండలం నాగాపూర్‌లో చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి… కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని విజ్ఞాన జ్యోతి హైస్కూల్‌కు చెందిన బస్సు గురువారం ఉదయం స్కూల్ పిల్లలను తీసుకురావడానికి నాగాపూర్ వెళ్లింది. బాసకొండ లక్ష్మి ఇంటి ముందు బస్సు ఆపగా ఆమె పెద్ద కూతురు మనశ్రీని బస్సు ఎక్కించింది. వెనక ఉన్న చిన్నకూతురు మహశ్రీ (2) స్కూల్ బస్సు దగ్గరకు వచ్చింది. చిన్నారిని గమనించాని బస్సు డ్రైవర్ బస్సును నడిపించగా మహశ్రీ తలకు ఢీకొనడంతో బలమైన గాయమైంది. ఆమెను వెంటనే మెట్‌పల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించింది. ఇంటి ముందే తమ రెండేళ్ల కూతురు మహశ్రీ విగత జీవిగా మారడంతో తల్లిదండ్రుల రోధనలు గ్రామస్థులను కలిచివేసింది. దీంతో కోపోద్రికులైన గ్రామస్థులు బస్సు డ్రైవర్ దేవదాస్‌ను చితకబాదారు. అజాగ్రత్తగా బస్సు నడిపి బాలిక మృతికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మురళీ తెలిపారు.

Comments

comments