Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

స్టార్ల నయా ట్రెండ్… లుంగీ స్టైల్!

Allu arjun-Iddarammayilathoఅల్లుఅర్జున్-ఇద్దరమ్మాయిలతో 

‘శ్రీమంతుడు’లో మహేష్‌బాబు లుంగీ స్టిల్ చూసి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో మురిసిపోయారు. టాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో ఒక్కసారిగా లుంగీ కట్టుకొని మాస్ స్టైల్‌లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకుల అభిమాన కథానాయకుడిగా పేరుతెచ్చుకున్న మహేష్ లుంగీలో కనిపించడంతో అభిమానులు ఎంతగానో ఆనందపడిపోయారు. ఇలా గతంలో స్టార్ హీరోలు పవన్‌కళ్యాణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్, అల్లుఅర్జున్ లుంగీలో కనిపించి అలరించారు. కథానాయకులు లుంగీ డ్యాన్సులు కూడా చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ లుంగీ డ్యాన్స్ చేసి కొత్త క్రేజ్‌ను తీసుకొచ్చాడు. టాలీవుడ్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న ఈ లుంగీ ట్రెండ్ మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి హీరోలు కొత్త కొత్త అవతారాల్లో దర్శనమిస్తుంటారు. తమ అభిమానులను అలరించడానికి మాస్ స్టైల్లో కనిపించడానికి వారు తాపత్రయపడుతుంటారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోలు లుంగీలో కనిపించి ఆకట్టుకుంటున్నారు. లుంగీ డ్యాన్సులు కూడా చేసి ప్రేక్షకులను మైమరపిస్తున్నారు. విభిన్న కథా చిత్రం ‘శ్రీమంతుడు’ స్టిల్‌లో మహేష్‌బాబు లుంగీలో ఎంతో హ్యాండ్‌సమ్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. మహేష్ న్యూలుక్‌ను చూసి అభిమానులు ఎంతో సంతోషపడిపోయారు. గతంలో తెలుగు సినిమాల్లో పలువురు హీరోలు లుంగీలో దర్శనమిచ్చారు. కొందరు హీరోలైతే ఏకంగా లుంగీ డ్యాన్సులు కూడా చేసి అలరించారు. మెగాస్టార్ చిరంజీవి గతంలో పలు సినిమాల్లో లుంగీలో కనిపించాడు. ‘ఘరానా మొగుడు’ సినిమాలో నగ్మాతో కలిసి చిరు ఓ ఘాటైన పాటలో ఆడి పాడి అదరగొట్టాడు. ‘ముఠా మేస్త్రీ’లో ఈ పేటకు నేనే మేస్త్రీ… పాటలో హుషారైన స్టెప్పులతో అలరించాడు. ‘అందరివాడు’లో చిరు లుంగీలో అదరగొట్టాడు. ఇక స్టార్ హీరో పవన్‌కళ్యాణ్ మొదటిసారిగా ‘తమ్ముడు’ సినిమాలో లుంగీ అవతార్‌లో కనిపించాడు. ఆతర్వాత బ్లాక్‌బస్టర్ హిట్ ‘అత్తారింటికి దారేది’లో లుంగీలో దర్శనమిచ్చి ప్రేక్షకులను మురిపించాడు. ఈ సినిమాలో పవన్ లుంగీ డ్యాన్స్‌తో సందడిచేసి ప్రేక్షకులను అలరించాడు. ఎన్టీఆర్ ‘సింహాద్రి’లో నువ్వు విజిల్ వేస్తే… పాటలో లుంగీ డ్యాన్సు చేసి అభిమానులను ఉర్రూతలూగించాడు. మాస్‌లుక్‌లో ఎన్టీఆర్ ఈ పాటలో ఆకట్టుకున్నాడు. ‘రామయ్య వస్తావయ్యా’లో మరోసారి ఈ స్టార్ హీరో లుంగీ డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. ఈ పాటలో మాస్ స్టెప్స్‌తో అలరించాడు. ఇటీవల ‘లయన్’ సినిమాలో నందమూరి బాలకృష్ణ సైతం లుంగీలో మాస్ లుక్‌తో కనిపించి ప్రేక్షకులను మురిపించాడు. బాలయ్య ఈ లుక్‌లో మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాడు. ఇక అల్లుఅర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో…’ సినిమాలో లుంగీ స్టైల్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకున్నాడు. ఈ స్టైలిష్ హీరో మాస్ లుక్‌లో అలరించాడు. ఇక కింగ్ ఖాన్ షారుఖ్‌ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో సౌతిండియన్ స్టైల్ లుంగీ డ్యాన్సుతో బాలీవుడ్‌ను షేక్ చేశాడు. దీంతో లుంగీ డ్యాన్స్‌కు యూత్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.

Pavan kalyan-Attarintiki Daredi Ntr-Ramayya Vastavayya. Mahesh babu-SRIMANTHUDU Chiranjeevi-andarivaadu balakrishna-lion

Comments

comments