Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

స్పీడ్ పెంచిన సునీల్

Sunilకమెడియన్‌గా ప్రేక్షకులకు గిలిగిం తలు పెట్టి కడుపుబ్బా నవ్వించిన సునీల్ ప్రస్తుతం హీరోగా మారి వరు సగా సినిమాలు చేస్తున్నాడు. ‘భీమవరం బుల్లోడు’ సినిమా తర్వాత సునీల్ మరో సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. దీంతో ఆయన ఈ ఏడా ది సినిమాలు చేయడంలో వేగాన్ని పెంచాడు. ఇందులో భా గంగా ముందుగా జోష్ సినిమా ఫేం వాసువర్మ డైరెక్షన్‌లో చేస్తున్న సిని మాను చివరి దశకు తీసుకొచ్చేశాడు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తికానుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలను కూడా మొదలుపెట్టారు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టో బర్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా సునీల్ ఇప్ప టికే వంశీ ఆకెళ్ల డైరె క్షన్‌లో ఓ సినిమా చేయ డానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ముహూర్తం కుదిరింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 18 నుంచి హైదరాబాద్‌లో మొదలుకానుంది. సునీల్ సరసన బాలీవుడ్ భామ బార్బీచోప్రా హీరోయిన్‌గా నటిం చనుంది. ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న నిర్మాత సుదర్శన్‌రెడ్డి ఆర్‌పిఎ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Comments

comments