Search
Saturday 17 November 2018
  • :
  • :

స్పెయిన్ లో నాని, సాయిపల్లవి ఆటపాట

nani

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నాని హీరోగా దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఎంసిఎ’. ‘ఫిదా’ ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రెండు పాటలు మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. సినిమాను డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ “సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వస్తోంది. ఈ ఏడాది ‘నేను లోకల్’తో నాని మా బ్యానర్‌లో మంచి హిట్‌ను అందుకున్నాడు. ‘ఎంసిఎ’ దాన్ని మించిన హిట్ అవుతుంది. నానీకి జోడీగా సాయి పల్లవి నటిస్తున్న ఈ చిత్రంలో భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మంచి మ్యూజిక్‌ను అందించాడు. అద్భుతమైన కథ, అన్నీ సమపాళ్లలోని ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నానీని దర్శకుడు వేణు సరికొత్త స్టయిల్‌లో చూపించనున్నారు. మిగిలిన రెండు పాటలను స్పెయిన్‌లో చిత్రీకరిస్తాం. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న క్రిష్టమస్ రిలీజ్ చేస్తాం”అని అన్నారు. విజయ్, సీనియర్ నరేష్, ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సమీర్ రెడ్డి, డైలాగ్స్‌ః మామిడాల తిరుపతి, శ్రీకాంత్ విస్సా, ఆర్ట్‌ః రామాంజనేయులు.

Comments

comments