Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

స్మార్ట్ సిటీల జాబితాలో వెనుకబడిన రామగుండం?

31-GDK-03-(1)గోదావరిఖని ః కేంద్ర ప్రభుత్వం వృద్ధి పరిచే స్మార్ట్ సిటీల జాబితా నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పేరు అట్టడుగు స్థానానికి చేరుకుంటోందని తెలిసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మూడు అత్యంత ఆకర్షణీయ నగరాలుగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లు జాబితాలో ముందు నిలువగా నాల్గవ స్థానంలో ఉన్న రామగుండం కార్పొరేషన్ స్థానిక అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్షం కారణంగా వెనుకబడి పోయినట్టు జిల్లా అధికార వర్గాల వల్ల తెలిసింది. ‘స్మార్ట్ సిటీ’ల ఎంపికలో ప్రభుత్వం, మున్సిపల్ శాఖ నిర్థేశించిన వివిధ విభాగాల్లో సాధిస్తున్న ప్రగతి ఆధారంగా మార్కులు (స్కోర్) లభిస్తాయి.

వ్యక్తిగత మరుగుదొడ్లు, రక్షిత మంచినీటి సరఫరా, రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పన్నుల వసూళ్లు, అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతమైన విధి నిర్వహణల ఆధారంగా ఈ మార్కులు లభిస్తాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వరంగల్, కరీంనగర్ తర్వాత రామగుండంను కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయటానికి ప్రతిపాదించింది. కానీ ప్రతిపాదనలకు అనుగుణంగా మార్కులు పొందటానికి, కార్పొరేషన్ పనులను వృద్ధి చేయటానికి, తద్వారా కేంద్రం నుంచి సహాయం పొందటానికి కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి చొరవ చూపటం లేదు. రామగుండం కన్నా మంచిర్యాల్, జగిత్యాల్ పట్టణాలు ముందు వరుసలో ఉండటం వందకు 84 మార్కులు కలిగి ఉండటాన్ని ప్రత్యేకంగా గమనించాల్సి ఉంది.

రామగుండం ఇప్పుడు 75 మార్కులతో వెనుకబడి ఉంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం మూడు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా, అదికూడా కేవలం మూడు గంటల పాటు అందిస్తున్నారు. మంచినీటి సరఫరా విషయమై గత రెండేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కనే గోదావరి నది ఉన్నా స్థానికులు మంచినీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేషన్ పరిధిలోని గుడిసెల, రేకుల షెడ్ల ప్రాంతాల్లో 43వేల కట్టడాలు ఉండగా ఏడు వేల ఇళ్ళల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల సౌకర్యాలు లేవు. సేవారంగంలో కూడా అధికారులు, సిబ్బంది అనుసరిస్తున్న అవినీతి చర్యల కారణంగా కార్పొరేషన్ ప్రతిష్ట గత ఐదేళ్ళలో పూర్తిగా దిగజా రింది. మెయిన్ రోడ్లు, బస్తీ రోడ్లు అనే తేడాలేకుండా రహదారుల వ్యవస్థ కనీ సం 85 మార్కులు సాధిస్తే తప్ప కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ జాబితాలో స్థానం నిలుపుకోవటం అసాధ్యమని అధికార వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

Comments

comments