Search
Monday 24 September 2018
  • :
  • :

హసీనా పాత్రలో…

sonakshi-Pathబాలీవుడ్‌లో ప్రస్తుతం జీవితచరిత్రల సినిమాల (బయోపిక్) హవా నడుస్తోంది. ఇప్పుడు ముంబయి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చరిత్ర ఆధారంగా సినిమా రాబోతోంది. ‘హసీనా’ అనే ఈ చిత్రానికి అపూర్వ లఖియా (షూటౌట్ ఎట్ లోఖండ్ వాలా ఫేం) దర్శకత్వం వహించ నున్నారు. ఈ చిత్రంలో దావూద్ సోదరి హసీనా పాత్రలో సోనాక్షి సిన్హా నటించనుంది. తనకు కథ ఎంతగానో నచ్చిందంటూ రచయిత ఖర్ రవి జియానికి ట్విట్టర్ ద్వారా ధన్యవా దాలు తెలిపింది. 2013లో వచ్చిన ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయి దుబారా’ చిత్రంలో సోనాక్షి దావూద్ ప్రియురాలిగా నటించడం విశేషం. ఈ చిత్రం 2016లో ప్రారంభం కానుంది.

Comments

comments