Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

హాఫ్ సెంచరీకి చేరువలో…

Trishaసౌత్‌లో గ్లామరస్ తారగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న భామ త్రిష. మోడల్‌గా రాణించిన తర్వాత సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తన టాలెంట్‌తో టాప్ హీరోయిన్‌గా రాణించింది. సౌత్‌లో తెలుగు, తమిళ్, కన్నడతో పాటు బాలీవుడ్‌లో కూడా నటించింది. కెరీర్‌లో రెండుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న త్రిష త్వరలో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకోబోతోంది. ఇప్పటివరకు 47 చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు త్వరలో 50 సినిమాల మార్క్‌ను చేరనుంది. చేతిలో ఉన్న సినిమాలతో ఈ ఫీట్‌ను సాధించిన మరో దక్షిణాది తారగా త్రిష నిలవబోతోంది. ఈ భామ పది సంవత్సరాల కెరీర్‌ను ఇప్పటికే పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సినిమాలతో పాటు 50వ సినిమాగా తమిళ్‌లో ‘తూంగవనం’లో నటిస్తోంది ఆమె. ఈ సినిమాలో విలక్షణ హీరో కమల్‌హాసన్‌తో త్రిష జతకడుతోంది.

Comments

comments