Search
Wednesday 19 September 2018
  • :
  • :

హాస్టళ్లలో  బయో మెట్రిక్ విధానం

ట్యూటర్లకు కూడా తప్పని సరి

హాస్టళ్ల మరమ్మతుకు రూ.4 లక్షల చొప్పున మంజూరు
విడియో కాన్పరెన్స్‌లో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎంవి రెడ్డి

31mdsrdp10సంగారెడ్డి : అభం, శుభం తెలియని వయస్సులో హాస్టళ్లలో చేరిన విద్యార్థుల ఆలనా పాలనా చూడాల్సిన బాధ్యత రావడం అదృష్టమ ని, ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎంవి రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఆయన అన్ని జిల్లాల హాస్టల్ వార్డెన్లు, ఎఎస్‌డబ్లుఓలు, ఇతర అధికారులతో విడియో కాన్పరెన్స్‌లో మాట్లాడారు. ముఖ్యంగా సిబ్బంది సమయ పాలన పాటించాలని, విద్యార్థులకు చదువుతో పాటు మంచి భోజనాన్ని అందించాలని, ఆటలు-పాటలు-వ్యాయా మం-క్రీడల్లో నైపుణ్యం పెంచాలన్నారు.

వచ్చే నెల 15లోగా అన్ని హాస్టళ్ల విద్యార్థులకు బయో మెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని, ట్యూటర్లకు కూడా బయో మెట్రిక్ విధానం అమలు చేస్తామన్నారు. కల్యాణ లక్ష్మి పథకం కింద 30 వేల కుటుంబాలకు రూ.51 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 20 వేల కుటుం బాలకు మాత్రమే నమోదు చేసుకున్నా యన్నారు. రాష్ట్రంలో మొత్తం 500 హాస్టళ్ల మరమ్మతులకు ఒక్కో దానికి నాలుగు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందని, ఈ నిధు ల ద్వారా హాస్టళ్లను బాగు చేయాలన్నా రు. విద్యా ర్థుల పాఠశాల రికార్డులను, వారం వారం నిర్వహించే పరీక్షల మా ర్కుల రికార్డును కూడా సక్రమంగా ఉంచాలన్నారు. విద్యా ర్థులకు ఎప్పటిక ప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. మంచి ప్రగతి సాధించిన విద్యార్థులను హాస్టళ్లకు పిలిపించి వారి అనుభవాలను పిల్లలతో పంచుకునేలా చేయాలన్నారు. జిల్లా డిడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 63 శాతం బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 2269 వధువుల కు రూ.51 వేల చొప్పున అందించామన్నారు.

Comments

comments